రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఓ ప్రెస్టీజియస్ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్.నారాయణ దీన్ని నిర్మిస్తున్నారు.
గురువారం ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ వేడుక జరిగింది. తన సినిమా ఓపెనింగ్స్‌కు హాజరు కాకపోవడం మహేష్ సెంటిమెంట్. అయితే ఈ సినిమా కోసం ఆ సెంటిమెంట్‌ను పక్కనపెట్టి, ఓపెనింగ్‌లో సందడి చేశారు. రాజమౌళి, మహేష్ బాబు ఫ్యామిలీస్‌తో పాటు అతికొద్దిమంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. మహేష్ బాబు కెరీర్‌లో ఇది 29వ చిత్రం కావడంతో ‘ఎస్‌ఎస్‌ఎంబి 29’ పేరుతో పిలుస్తున్నారు.
సమ్మర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దీనికి కథను అందిస్తుండగా, ఆస్కార్ విజేత కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. ప్రియాంక చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్‌తో పాటు హాలీవుడ్ నటీనటులు, టెక్నీషియన్స్ వర్క్ చేయనున్నారని టాక్. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ అడ్వెంచర్‌గా ఇది ఉండబోతోందని విజయేంద్ర ప్రసాద్ గతంలో చెప్పారు. అందుకు తగ్గట్టే లొకేషన్స్ కోసం ఒడిశా, ఆఫ్రికాలోని అడవులు సహా అనేక ప్రదేశాలలో పర్యటించారు రాజమౌళి. మునుపెన్నడూ కనిపించని న్యూ లుక్‌లో కనిపించనున్న మహేష్ బాబు.. దీనికోసం ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నారు.