‘ఏకశిలా’ పేరుతో ​’సెయింట్​జోసెఫ్స్ హై స్కూల్’ మోసం

‘ఈ స్కూల్ పేరు​గత ఎడ్యుకేషన్​ అకడమిక్ ​ఇయర్ (2024-25) వరకు సెయింట్​జోసెఫ్ హై​స్కూల్.. ప్రియదర్శిని కాలనీ, హయత్ నగర్.. కానీ ఈ అకడమిక్ ​ఇయర్​(2025-26) కు సడెన్​గా ”ఏకశిలాస్ సెయింట్​జోసెఫ్స్​హైస్కూల్’​గా మార్చేశారు.


హడావుడిగా స్కూల్​ బిల్డింగ్​కు రంగులు వేయడంతో పాటు.. ఆవరణలో ఓ భారీ అక్రమ షెడ్ నిర్మించి.. నేమ్​ బోర్డులు పెట్టారు. ఏకశిలాస్​ సెయింట్​ జోసెఫ్​ ​హైస్కూల్ పేరుతో పాంప్లెంట్లు, వేసి ‘హైదరాబాద్​నగరంలో మొదటి ఏకశిలా గ్రూప్​ ఆఫ్ ​ఇన్స్టిట్యూషన్’ ​అంటూ మోసపూరిత ప్రచారం షురూ చేశారు. స్టేట్​ పర్మిషన్ ​ఉన్న స్కూల్‌లో సీబీఎస్ఈ కరిక్యులమ్ .. బోధిస్తామంటూ.. ఒక్కసారిగా ట్యూషన్​ ఫీజు, టెక్స్ట్, నోట్‌బుక్స్, షూ, టై, బెల్టుల ఫీజులు డబుల్​ చేశారు. ఈ మోసపూరిత తతంగంతో అవాక్కయిన పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు యాజమాన్యాన్ని నిలదీస్తే.. ‘మేము స్కూల్​ను కొనుగోలు చేశాం. ఇన్​ఫ్ట్రా స్ట్రక్షర్​ మార్చివేశాం.. మా ఫీజులు ఇంతే’ అంటూ.. తెగేసి చెప్పారు. పేరెంట్స్​ పాత యాజమాన్యానికి కాల్​ చేస్తే.. ‘మేం స్కూల్​ అమ్మేశాం’.. ఏం చేయలేం.. అంటూ సమాధానం.. ‘ ఏం చేయాలో అర్థం కావడం లేదంటూ.. పేరెంట్స్​ లబోదిబోమంటున్నారు.

ఫీజులు పెంచేందుకు మోసపూరిత ప్రచారం..

‘ఏకశిలా గ్రూప్​ఆఫ్​ ఇన్స్టిట్యూషన్’ స్కూల్​ పేరుతో రంగారెడ్డి జిల్లాలో ఎక్కడా కనీసం పర్మిషన్​కూడా లేదు. కానీ ‘సెయింట్​జోసెఫ్స్ హై​​స్కూల్​హయత్​నగర్’ ​పేరుతో ఉన్న పర్మిషన్​కు ఏకశిలా జోడించి.. సీబీఎస్ఈ కరిక్యులమ్​.. అంటూ ప్రచారం చేస్తూ.. అడ్డగోలు ఫీజులు గుంజుతూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. ఒక వేళ ప్రైవేటు విద్యా సంస్థలు ఫీజులు పెంచాలంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. తల్లిదండ్రులు, టీచర్స్ అసోసియేషన్ వారితో తప్పక సంప్రదించాలి. అనుమతి తీసుకోవాలి. కానీ మోసాలక్​ కేరాఫ్​అడ్రస్​గా పేరొందిన ఏకశిలా యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి , స్టేట్​పర్మిషన్​, స్టేట్​సిలబస్​బోధించాల్సిన స్కూల్​లో సీబీఎస్ఈ కరిక్యులం అంటూ నమ్మించి నట్టేట ముంచుతోంది. కేవలం ఎల్‌కేజీ పిల్లల టెక్స్ట్​ బుక్స్​కే రూ.7,500 పైగా వసూలు చేస్తున్నారని పిల్లల తల్లిదండ్రులు చెప్తుండడం​గమనార్హం.

ఎవరికి చెప్పుకున్నా.. తమనేమీ చేయలేరు!

ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో టెక్స్ట్, నోట్‌ బుక్స్, షూ, టై, బెల్టులు అమ్మొద్దని విద్యాశాఖ నిబంధనలున్నాయి. కానీ ఓ పేరెంట్..​ ‘టెక్స్ట్, నోట్‌బుక్స్, షూ, టై, బెల్టుల కొనుగోలు కోసం స్కూల్​కు వెళ్లి ‘ పాత స్కూల్లో టెక్స్ట్​ బుక్స్​, నోట్​ బుక్స్‌కు​, ఇంత ఫీజు లేకుండే.. సడెన్‌​గా ఇంత ఫీజు పెంచితే ఎలా?’ అంటూ ప్రశ్నిస్తే.. బుక్స్​ కొనుగోలు చేసినట్లు రిసిప్ట్​ ఇవ్వమంటే ఇవ్వకపోగా.. ‘చదివితే చదివించండి.. లేకపోతే టీసీ తీసుకుని వెళ్ళండి.. ఎవరికి చెప్పుకున్నా.. తమను ఏమీ చేయలేరు. మా ఏకశిల రూల్స్‌ ఇంతే ఉంటాయి. మా స్కూల్‌కు ప్రత్యేక నిబంధనలు ఉంటాయి.’ అని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ నిబంధనలకు తూట్లు..

సీబీఎస్ఈ మోసపూరిత ప్రచారమే కాకుండా ఏకశిలా యాజమాన్యం .. బల్దియా నిబంధనలు పాటించకుండా స్కూల్​ ఆవరణలో భారీ అక్రమ షెడ్​ నిర్మించింది. దాంతో స్కూల్​తరగతి గదులను పూర్తిగా వెంటిలేషన్​లేకుండా క్లాసులు నిర్వహిస్తోంది. కనీసం 250 మంది విద్యార్థులు చదివే పాఠశాలలో 700 చదరపు మీటర్ల విస్తీర్ణంలో స్పోర్ట్స్​ గ్రౌండ్​ ఉండాలి. కానీ అంతకు డబుల్ ​సంఖ్యలో విద్యార్థులు ఉన్నా.. నామ్​ కే వాస్తే 200 చదరపు మీటర్లు కూడా లేని గ్రౌండ్​ చూపిస్తున్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇవేవీ స్కూల్​ యాజమాన్యం పట్టించుకోవడం లేదు.

నియంత్రణ ఏదీ..?

హయత్ నగర్​ మండలంలో విద్యాశాఖ లెక్కల ప్రకారం.. పర్మిషన్​ ఉన్న స్కూళ్లు సుమారు 127 వరకు ఉన్నాయి. అందులో చాలా స్కూళ్లు పర్మిషన్​ ఒక చోట ఉండి.. మరో చోట స్కూళ్లు నడుపుతున్నారు. వీటిలో విద్యా వ్యాపారం చేసి అదుపూ లేకుండా నడుపుతున్నారు. స్టేట్‌, సీబీఎస్‌ఈ తదితర బోర్డుల పేరిట ఫీజుల దోపిడీ యథేచ్ఛగా జరుగుతున్నా పర్యవేక్షణ గానీ, నియంత్రణ గానీ ఎక్కడా కనిపించడం లేదు. పాఠశాలలపై నిఘా ఉంచాల్సిన విద్యాశాఖ అధికారులు మామూళ్ల మత్తులో పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. విద్యార్థి సంఘాల నాయకులు డీఈవో, ఎంఈవోకు ఎన్ని ఫిర్యాదులు చేసినా.. పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు.

కఠిన చర్యలు తీసుకోవాలి

హయత్​ నగర్​ మండలంలో చాలా ప్రైవేట్​ స్కూళ్లు నిబంధనలు పాటించకుండా చిన్నారుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ముఖ్యంగా ఏకశిలా ఇనిస్టిట్యూషన్​ మేనేజ్మెంట్​, సీబీఎస్​ఈ కరిక్యులం పేరుతో మోసం పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. విద్యాశాఖ అధికారులు ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడాలి. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కనీసం స్కూల్​ విజిట్​ చేయకపోవడం దారుణం.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.