ఏసీబీ వలలో స్టేషన్ ఘన్ పూర్ సబ్ రిజిస్ట్రార్

జనగామ జిల్లా స్టేషన్ ఘన్​పూర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.


స్టేషన్ ఘన్ పూర్ సబ్ రిజిస్ట్రార్ రామకృష్ణ ఏసీబీ అధికారులకు చిక్కారు.

ఇంటి రిజిస్ట్రేషన్ కోసం రూ. 18వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అలాగే ప్రైవేట్ అసిస్టెంట్ రమేశ్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. రామకృష్ణ ఆరు నెలల క్రితమే జనగామ నుండి ఘన్పూర్ కు ట్రాన్స్​ఫర్​పై వెళ్లారు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో దాడులు చేశారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.