పొట్ట చెక్కలయ్యేలా నవ్వించే కామెడీ యాక్షన్.. ఓటీటీలోకి వచ్చిన కడ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.

www.mannamweb.com


ఎప్పుడూ హారర్, సస్పెన్స్ మూవీస్ మాత్రమే కాదు.. అప్పుడప్పుడు కామెడీ యాక్షన్ కూడా చూడాల్సిందే అంటున్నారు ఓటీటీ లవర్స్. కొన్నాళ్లుగా డిజిటల్ ప్లాట్ ఫామ్ పై హారర్ కంటెంట్ చిత్రాలు దూసుకుపోతున్నాయి.

మరోవైపు థియేటర్లలోనూ భారీ బడ్జెట్ చిత్రాలు మంచి వసూళ్లు రాబడుతున్నాయి. కానీ ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన చిన్న లు మాత్రం బాక్సాఫీస్ వద్ద సంచనలం సృష్టిస్తున్నాయి. ఇటీవల మలయాళంలో తెరకెక్కించిన పలు చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అలాగే తమిళం, కన్నడలోనూ పలు లు సూపర్ హిట్ అయ్యాయి. రెండు నెలల కిందట థియేటర్లలో రిలీజై పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న కన్నడ కామెడీ యాక్షన్ డ్రామా “చిల్లీ చికెన్”. ఎలాంటి హైప్ లేకుండా సైలెంట్ గా థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. తాజాగా ఈ ఓటీటీలోకి వచ్చింది.

బెంగుళూరులో జరిగిన ఓ నిజ ఘన ఆధారంగా చేసుకుని రూపొందించిన ఈ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. స్థానిక కన్నడిగులు వలస వచ్చిన ఈశాన్య భారత పౌరులపై చూపే వివక్షను కూడా ఈ మూవీ ద్వారా చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ ప్రతీక్ ప్రజోష్. ఈ ఏడాది జూన్ 21న ఈ మూవీ విడుదల కాగా.. రెండు నెలల తర్వాత బుధవారం ఈ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ కు ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ వస్తుంది.

కథ విషయానికి వస్తే..

చిల్లీ చికెన్.. నార్త్ ఈస్ట్ ఇండియా డిష్. కానీ దేశవ్యాప్తంగా పాపుల్ అయిన వంటకం. చిల్లీ చికెన్ నూడల్ హోమ్ అనే రెస్టారెంట్ నడిపే ఆదర్శ్ (శృంగ బీవీ) అనే యువకుడు.. అతడి దగ్గర పనిచేయడానికి వచ్చే నలుగురు నార్త్ ఈస్ట్ ఇండియా యువకుల చుట్టూ తిరుగుతుంది ఈ కథ. తమ రెస్టారెంట్ ను టాప్ స్థానంలోకి తీసుకువెళ్లాలని ఆశయంతో ఆదర్స్ పనిచేస్తుంటాడు. అక్కడి సమాజంలో గుర్తింపు, గౌరవం కోసం అక్కడ పనిచేసే ఈశాన్య భారత వర్కర్స్ ఆశపడుతుంటారు. సరదాగా సాగిపోయే వీళ్ల జీవితంలో ఓ వర్కర్ అనూహ్య మరణం వాళ్ల జీవితాలను ఏ విధంగా మార్చింది అనేది కథ.