Student offered Rs. 100 : క్లాస్‌మేట్‌ను అత్యాచారం చేసి చంపేయాలని

మహారాష్ట్ర పూణెలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగుచూసింది. దౌండ్ తహసీల్‌లోని ఓ స్కూల్‌లో విద్యార్థి తన సహవిద్యార్థిని అత్యాచారం చేసి చంపేందుకు తోటి విద్యార్థినికి 100 రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చిన ఘటన వెలుగులోకి వచ్చింది.


పాఠశాల విషయాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించడంతో వివాదం మరింత ముదిరింది.

పూణెలోని ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తల్లిదండ్రుల సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. ఈ విషయాన్ని ఓ విద్యార్థిని చూసింది. వెళ్లి టీచర్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో కోపం పెంచుకున్న విద్యార్థి.. మరో విద్యార్థి వద్దకు వెళ్లాడు. రూ.100 సుపారీ ఇస్తానని, తనపై ఫిర్యాదు చేసిన బాలికను అత్యాచారం చేసిన తర్వాత చిత్రహింసలు చేసి చంపాలని కాంట్రాక్ట్ ఇచ్చాడు.

బాలికకు విషయం తెలియడంతో వెళ్లి ఇంట్లో చెప్పింది. కుటుంబ సభ్యులు పాఠశాలలో ఫిర్యాదు చేశారు. అయితే పాఠశాల యాజమాన్యం ఈ విషయం బయటకు రాకుండా అణిచివేసింది. దీంతో నేరుగా దౌండ్ పోలీస్ స్టేషన్ వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు. జనవరి 22న ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో ఈ ఘటన జరిగింది.

ఈ విషయంలో ప్రిన్సిపాల్, క్లాస్ టీచర్, మరో టీచర్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. విద్యార్థిని మానసికంగా వేధించి, చదువును నాశనం చేసినందుకు ప్రిన్సిపాల్, ఇద్దరు ఉపాధ్యాయులు ప్రయత్నించినట్టైందని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పాఠశాల ప్రతిష్టను కాపాడే ప్రయత్నంలో ప్రిన్సిపాల్, ఇద్దరు ఉపాధ్యాయులు సంఘటనను అణిచివేసేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు.

మద్యం తాగించి బాలికలపై అత్యాచారం

గత ఏడాది సెప్టెంబర్‌లో పూణె రూరల్ పోలీసులు బారామతికి చెందిన ఇద్దరు బాలికలపై సెప్టెంబర్ 14న హడప్సర్ ప్రాంతంలో బలవంతంగా మద్యం తాగించి అత్యాచారం చేసిన కేసులో నలుగురు యువకులను అరెస్టు చేశారు. నిందితులను జ్ఞానేశ్వర్ అటోల్ (27), యష్ అలియాస్ సోన్యా అటోల్ (21), జే మోర్ (25), అనికేత్ బంగారే (20)గా గుర్తించారు.

నిందితులు, బాధితులు బారామతిలోని ఒకే గ్రామానికి చెందినవారని పూణే రూరల్ పోలీసు సూపరింటెండెంట్ పంకజ్ దేశ్‌ముఖ్ తెలిపారు. వారందరికీ ఒకరికొకరు తెలుసు అని వెల్లడించారు. సెప్టెంబర్ 14న బాధితులిద్దరూ ఆలయానికి వెళుతున్నట్లు తల్లిదండ్రులకు తెలియజేశారు. అయితే బాలికలు తిరిగి ఇంటికి రాలేదని స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. ఆ తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది.