భర్త రిటైర్మెంట్ పార్టీలో భార్య సడన్ డెత్

www.mannamweb.com


చావు ఎప్పుడు.. ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. ఈ మధ్య చిన్నా..పెద్ద తేడా లేకుండా కళ్ల ముందే కుప్పకూలిపోతున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య తరుచుగా జరుగుతున్నాయి.

కోవిడ్ తర్వాత అన్ని సడన్ డెత్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే రాజస్థాన్‌లోని కోటాలో జరిగింది. అందరూ చూస్తుండగానే కళ్ల ముందే మహిళ ప్రాణాలు వదిలింది. దీంతో అందరూ విషాదంలో మునిగిపోయారు.

దేవేంద్ర శాండల్, టీనా దంపతులు. టీనా అనారోగ్యంతో బాధపడుతోంది. దంపతులకు సంతానం లేదు. దీంతో భార్యను కంటికి రెప్పలా చూసుకునేందుకు మూడేళ్ల ముందుగానే దేవేంద్ర రిటైర్మెంట్ తీసుకున్నారు. అయితే రిటైర్మెంట్ ఫంక్షన్‌ను ఆఫీసులో నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి భార్య టీనాను కూడా తీసుకెళ్లారు. కార్యాలయంలో గ్రాండ్‌గా ఫంక్షన్ నిర్వహించారు. సహచర ఉద్యోగులంతా విషెస్ చెబుతున్నారు. దేవేంద్ర, టీనా ఇద్దరిని కుర్చీల్లో కూర్చోబెట్టి సత్కరించారు. అందరూ నవ్వుతూ.. ఉల్లాసంగా గడుపుతున్నారు. ఇంకోవైపు మొబైల్‌లో దృశ్యాలు రికార్డ్ చేస్తున్నారు. ఇంతలోనే టీనా కుర్చీలోనే కుప్పకూలిపోయింది. ఈ హఠాత్తు పరిణామంతో భర్త పట్టుకోబోగా టేబుల్‌పై కూలిపోయింది. హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో భర్త, ఉద్యోగులంతా విషాదంలో మునిగిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.