యూరిక్‌ యాసిడ్‌తో ఇబ్బంది పడుతున్నారా? ఈ మూలికలతో చేసిన టీ తాగితే చిటికెలో ఉపశమనం

www.mannamweb.com


హై బ్లడ్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగినప్పుడు, శరీరంలో టాక్సిన్స్ స్థాయి కూడా పెరుగుతుంది.

యూరిక్ యాసిడ్‌ శరీరంలోని ప్యూరిన్స్ అనే పదార్థాలను విచ్ఛిన్నం చేస్తుంది. రక్తంలో అధిక యూరిక్ యాసిడ్ స్థాయిలు ఉంటే అనతి కాలంలోనే మూత్రపిండాల సమస్యలను కలిగిస్తాయి. వాటి పనితీరును దెబ్బతీస్తుంది.

కిడ్నీలో యూరిక్ యాసిడ్ చేరితే అవి సరిగ్గా పని చేయవు. చేతులు, కాళ్ల వాపులు, కాళ్ల నొప్పులు వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. కాబట్టి యూరిక్ యాసిడ్ స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి, గౌట్ సమస్యను నివారించడానికి సరైన ఆహార నియమాలు అనుసరించాలి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

పసుపులో కర్కుమిన్ అనే ప్రత్యేక సమ్మేళనం ఉంటుంది. ఇన్‌ఫ్లమేటరీ సమస్యలను దూరం చేయడంలో పసుపు ఉపయోగపడుతుంది. పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. ఇది కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. యూరిక్ యాసిడ్ రోగులు ప్రతిరోజూ ఉదయం కొద్దిగా పసుపు, చెరకు బెల్లం తింటే మంచిది.

యూరిక్ యాసిడ్ నివారించడంలో అల్లం కూడా ప్రభావవంతంగా పని చేస్తుంది. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఇందులో అధికమే. ప్రతిరోజూ కనీసం రెండు కప్పుల అల్లం టీ తాగాలి. ఇది జీర్ణ సమస్యలను పరిష్కరించడంతోపాటు నొప్పిని కూడా తగ్గిస్తుంది.

ధనియాలు కూడా యూరిక్ యాసిడ్ నిరోధించడానికి చాలా బాగా పనిచేస్తాయి. కాబట్టి ధనియాలు ఉడికించి తయారు చేసిన టీ తీసుకుంటే ఈ సమస్య తగ్గుముఖం పడుతుంది. ఈ గింజలు నానబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తాగినా ప్రయోజనం ఉంటుంది.