Suma బండారం బయటపెట్టిన యూట్యూబర్

తెలుగు టెలివిజన్ రంగంలో దాదాపు పాతికేళ్లుగా స్టార్ యాంకర్‌గా వెలుగొందుతున్నారు సుమ కనకాల . ఇండస్ట్రీకి ఎంతో మంది వచ్చారు, వెళ్లారు కానీ సుమ మాత్రం స్పెషల్.


50 ఏళ్లకు చేరువ అవుతున్నా నేటికీ తన హవా చూపిస్తూనే ఉన్నారు. యాంకరింగ్‌లో పీహెచ్‌డీ చేసిన సుమను అనుసరిస్తే ఈ ఫీల్డ్‌లో సక్సెస్ కొట్టొచ్చని కొత్త తరం అనుకుంటున్నారు. ఏ సందర్భంలో ఎలాంటి మాటలు మాట్లాడాలి? డల్‌గా ఉన్న వాతావరణంలో ఎలా జోష్ తీసుకురావాలో సుమకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు.

ఓ మలయాళీ అమ్మాయే అయినా తెలుగువారి కంటే అద్భుతంగా తెలుగును మాట్లాడుతూ మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా తెలుగు భాషాభిమానుల మన్ననలు పొందారు సుమ కనకాల. 1975 మార్చి 22న కేరళలోని పాలక్కాడ్‌లో జన్మించారు సుమ. ఆమె పూర్తి పేరు పల్లాస్సన పాచువెట్టిల్ సుమ. తల్లిదండ్రులు ప్రణవి నారాయణన్ కుట్టి నాయర్, పల్లాస్సన పాచువెట్టిల్ విమల. తండ్రి రైల్వే ఉద్యోగి కావడంతో ఆయన ఉద్యోగరీత్యా సుమ కుటుంబం సికింద్రాబాద్‌లోని మెట్టుగూడలో స్థిరపడింది.

స్థానిక సెయింట్ ఆన్స్ హైస్కూల్‌, రైల్వే డిగ్రీ కాలేజీలో చదువుకున్నారు సుమ. క్లాసికల్ డ్యాన్స్‌లో ప్రావీణ్యం ఉన్న ఆమె స్టేజ్‌పై పలు ప్రదర్శనలు ఇచ్చారు. చదువు తర్వాత 16 ఏళ్ల వయసులోనే యాంకరింగ్ వైపు వచ్చి సత్తా చాటారు. హోస్టింగ్‌ కంటే ముందు కళ్యాణ ప్రాప్తిరస్తు అనే సినిమాలో ఆమెకు అవకాశం దక్కింది. ఆ తర్వాత స్వయంవరం, అన్వేషిత, గీతాంజలి, రావోయి చందమామ తదితర సినిమాల్లో నటించారు. పవిత్ర ప్రేమలో నందమూరి బాలకృష్ణ చెల్లెలిగా కనిపించి అలరించారు .

అయితే తక్కువ సమయంలో తనకు సినిమాలు సెట్ కావని అర్ధం చేసుకున్న సుమ.. చావో రేవో బుల్లితెరపైనే తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ మధ్యమధ్యలో పలు సినిమాలలో గెస్ట్ అప్పీయరెన్స్ ఇస్తూ ప్రేక్షకులను ఎంటర్‌టైనర్ చేశారు. అలాంటి దాదాపు 20 ఏళ్ల తర్వాత లీడ్ రోల్‌లో జయమ్మ పంచాయతీ అంటూ పలకరించారు. సుమ క్రేజ్‌తో ఈ సినిమాకు మంచి వసూళ్లే వచ్చాయి.

నటుడు రాజీవ్ కనకాలను ప్రేమ వివాహం చేసుకున్నారు సుమ. ఈ దంపతులకు కుమారుడు రోషన్ కార్తీక్, కుమార్తె మనస్విని కనకాల ఉన్నారు. ప్రస్తుతం కొడుకుని హీరోగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సుమకు స్టార్స్‌ను మించిన ఫాలోయింగ్ ఉంది. లేటేస్ట్ ఫోటో షూట్‌లతో ఆ స్టార్ యాంకర్ హల్ చల్ చేస్తుంటారు.