ఎండాకాలం రానే వచ్చేసింది. ఇప్పటికే ఉక్కపోత మొదలైంది. మరిన్ని రోజులైతే ఇంట్లో కూడా వేడి వాతావరణం అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఇక మీ ఇంట్లో ఎయిర్ కండీషనర్, కూలర్ లాంటివి లేకుండా ఇక ఆ అవస్థలు వర్ణణాతీతం. ఒక వేళ ఉన్నా.. 24 గంటలు అదే పనిగా ఏసీలను, కూలర్లను ఉపయోగించలేం. అందుకే ఇవేవీ లేకున్నా మీ ఇంటిని చల్లబరిచేందుకు కొన్ని మార్గాలున్నాయి. అవేంటో తెలుసుకోండి..
వేసవి కాలంలో వీచే వేడి గాలుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. లేదంటే ఇవి మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఉక్కపోత మరీ ఎక్కువైతే అది డీహైడ్రేషన్ కు దారి తీయవచ్చు. ఎండాకాలంలోకి పూర్తిగా అడుగుపెట్టక ముందే అధక ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అందరి ఇళ్లలోనూ సౌకర్యవంతమైన కూలర్లు, ఏసీలు ఉండవు. అయినప్పటికీ మీ ఇంటిని ఈ టిప్స్ తో చల్లగా మార్చుకోవచ్చు. ఈ చిన్న పొరపాట్లు చేయకుండా ఉంటే వేడి గాలుల నుంచి తప్పించుకోవచ్చు.
కిటికీలను మూసి ఉంచడి..
అవును మీరు వింటున్నది నిజమే. చల్లగాలి కోసం కిటికీలు తెరుస్తుంటారు. మూసేయడం ఏమిటనుకుంటున్నారా.. బయట వడ గాల్పులు ఉన్నప్పుడు మీకు ఎలాంటి చల్లగాలి లోపలికి రాదు. ఈ గాలులను కిటికీలు తెరిచి ఆహ్వానిస్తే ఇల్లంతా మరింత అట్టుడికినట్టు అవుతుంది. కిటికీల ద్వారా మీ ఇంట్లోకి ప్రవేశించే సూర్యకాంతిలో దాదాపు 76శాతం వేడిగా మారుతుంది. అందుకే కిటికీలు, బ్లైండర్ల వంటివి మూసేసి.. నిరంతరం మీ కర్టెన్లను వేసి ఉంచండి. లోపల వేడిని తగ్గించడానికి ఇంధన శాఖ తెలుపు-ప్లాస్టిక్ బ్యాకింగ్‌తో మీడియం-రంగు డ్రేప్‌లను సూచిస్తుంది. కిటికీలను కప్పి ఉంచడానికి, ఎండ రాకుండా ఉండేందుకు బ్లాక్అవుట్ కర్టెన్లను కూడా వాడుకోవచ్చు.
ఓవెన్ ఉపయోగించవద్దు..
ఎండాకాలం మైక్రో ఓవెన్ వినియోగాన్ని వీలైనంత తగ్గించండి. ఎందుకంటే 400-డిగ్రీల ఓవెన్ కలిగించినంత హీట్ మరేది కలిగించదు. బర్నర్లు కూడా కొంత వేడిని విడుదల చేస్తాయి. కాబట్టి మీరు ఏ వంటగది ఉపకరణాలను ఉపయోగిస్తున్నారో చూసుకోండి. బదులుగా అవుట్‌డోర్ గ్రిల్లింగ్ లేదా వేడి తక్కువగా అవసరం ఉండే ఏదైనా వంటకాలను ఎంచుకోండి. కచ్చితంగా ఓవెన్ ఉపయోగించాల్సి వస్తే.. రాత్రి వాతావరణం చల్లబడిన తర్వాత దీనికి మంచి సమయం.
లైట్లు, బల్బులను మార్చుకోండి..
వేసవిలో అనవసరమైన వేడిని తెచ్చేది వంటగది ఉపకరణాలు మాత్రమే కాదు. లైట్ బల్బులు కూడా. వీటినుంచి వచ్చే వేడి పెద్దగా బయటకు తెలియదు కానీ ఇన్కాండిసెంట్ లైట్ బల్బులు అవి ఉపయోగించే శక్తిలో 90% వృధా చేయడం ద్వారా ఎక్కువ వేడిని విడుదల చేస్తాయి. కాబట్టి సీఎఫ్‌ఎల్ (కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్స్) లేదా ఎల్లీడీ బల్బులకు మారడం వల్ల మీ ఇంటిని చల్లగా ఉంచుకోగలుగుతారు. ఇవి మీ కరెంటు బిల్లును కూడా ఆదా చేస్తాయి.
ఫ్యాన్లను సరైన మార్గంలో ఉంచండి..
మీ ఇంట్లో ఏసీ లేకపోతే ఫ్యాన్లను కూడా మీకు అనువుగా మార్చుకోవచ్చు. అయితే, వీటిని ఏ దిక్కున ఉంచుతున్నారన్నది చాలా ముఖ్యం. చల్లని గాలిని ప్రసరింపజేయడానికి, వేడి గాలిని బయటకు నెట్టడానికి ఫ్యాన్లను క్రాస్ బ్రీజ్ పద్దతిలో వాడటం ఉత్తమ మార్గం. మీ ఇంట్లో చల్లటి భాగాన్ని కనుగొని, ఫ్యాన్‌ను మీ ఇంట్లో వేడిగా ఉండే భాగం వైపుకు తిప్పండి. ఇది ఇంటి ఒక వైపు నుండి చల్లటి గాలిని పీల్చుకోవడానికి అలాగే వేడి గాలిని బయటకు నెట్టడానికి సహాయపడుతుంది. ఫ్యాన్ ముందు ఒక గిన్నెలో నీటిని లేదా ఐస్ క్యూబ్స్ ను ఉంచినా ఇల్లంతా చల్లగా మారుతుంది.
తేమ లేకుండా చూసుకోండి..
మీరు తేమతో కూడిన వాతావరణంలో నివసిస్తుంటే, తేమ వేసవి వేడిని మరింత తీవ్రతరం చేస్తుంది. డీహ్యూమిడిఫైయర్ ను ఏర్పాటు చేసుకుంటే గది ఉష్ణోగ్రతను తగ్గించకపోయినా, దీని ద్వారా కలిగే వేడి ఈ రోజులను మరింత అసౌకర్యంగా మారుస్తుంది. జిగట, వేడి గాలిని నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది. తేమ మన చెమట ఆవిరైపోయే రేటును తగ్గిస్తుంది కాబట్టి , తేమతో కూడిన వాతావరణంలో మనం తరచుగా చాలా వేడిగా, చెమట ఎక్కువగా పడతాము, చెమటలు పడుతున్నట్టుగా ఫీలవుతాం. కాబట్టి డీహ్యూమిడిఫైయర్ ఉంటే సమ్మర్ లో ఇంటిని మరింత సౌకర్యవంతంగా ఉంచవచ్చు.
రాత్రి గాలి లోపలికి రానివ్వండి
చివరగా, మీరు రాత్రి ఉష్ణోగ్రత పడిపోయే ప్రదేశంలో నివసిస్తుంటే పడుకునే ముందు కిటికీలు తెరవండి. బయటి ఉష్ణోగ్రతలతో ఇంటిని చల్లబరచడం వల్ల మీకు డబ్బు ఆదా అవుతుంది. మీ ఇంటిని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. బయట చాలా వేడిగా మారకముందే చల్లని గాలి లోపలికి వచ్చేలా ఉదయం కిటికీలను తిరిగి మూసివేయండి.