ఏపీలో మహిళలకు సూపర్ న్యూాస్.. రూ.10వేల నుంచి రూ.2 లక్షలు వరకు ఇస్తారు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం సరికొత్త పథకాలను అమలు చేస్తోంంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి కుటుంబంలో ఒక మహిళా పారిశ్రామికవేత్త ఉండాలని లక్ష్యంతో అధికారులకు దిశా నిర్దేశం చేశారు.


ఆయన వచ్చే మహిళా దినోత్సవం నాటికి రాష్ట్రంలో లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశించారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. పరిశ్రమలు నడుపుతున్న వారికి, కొత్తగా పరిశ్రమలు పెట్టాలనుకునే వారికి తోడ్పాటు ఇస్తోంది.

రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఉఫాది పరిశ్రమలు స్థాపించాలనుకునే మహిళలకు ప్రభుత్వం సహాయం చేస్తుంది. ఏపీ ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధి కోసం బ్యాంకర్లు సహకరించాలని కోరుతోంది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) మహిళలకు ఆర్థికంగా ఎదిగే అవకాశాలు కల్పిస్తోంది. స్వయం సహాయక సంఘాల మహిళలు డెయిరీ, కలంకారి, పచ్చళ్లు, ఆహార శుద్ధి యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. మార్కెటింగ్‌లో కూడా సహాయం చేస్తారు. యూనిట్ పెట్టిన వారు కనీసం ఒక్కరికైనా ఉద్యోగం ఇవ్వాలి.. అలా చేస్తేనే యూనిట్ విస్తరణకు రుణాలు ఇస్తామని అధికారులు తెలిపారు.

ఈ మేరకు రాష్ట్రంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు DRDA అధికారులు సర్వే చేస్తున్నారు. ఈ నెల 15 నుంచి సర్వే మొదలవుతుంది. మహిళలు నెలకొల్పిన యూనిట్ల వివరాలు సేకరిస్తారు. వారి జీవనోపాధిని మెరుగుపరచడానికి, పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు సహాయం చేస్తారు. మొదటి దశలో వీలైనంతమందిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మహిళలు ఏర్పాటు చేసిన యూనిట్లను జిల్లాల వారీగా గుర్తించి వివరాలు తెలుసుకుంటారు. ఈ సర్వే ద్వారా మహిళల యూనిట్లను మూడు (జీవనోపాధుల యూనిట్లు, ఎంటర్‌ప్రెన్యూర్ యూనిట్లు, ఎంటర్‌ప్రైజెస్ యూనిట్లు) రకాలుగా విభజిస్తారు. యూనిట్ల విస్తరణకు, మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారు.

‘మహిళలు ఎలాంటి పరిశ్రమలు నడుపుతున్నారు? ఎంత ఆదాయం వస్తోంది? ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నారు’ వంటి సమాచారం సేకరిస్తారు. ‘మహిళల యూనిట్‌ విస్తరణకు కనిష్ఠంగా రూ.10వేలు నుంచి గరిష్ఠంగా రూ.2లక్షలు’ వరకు బ్యాంకుల సాయంతో మంజూరు చేస్తారని అధికారులు చెబుతున్నారు. అలాగే ‘స్త్రీనిధి పథకం కింద రూ.10వేల నుంచి రూ.లక్ష, ఎస్సీ, ఎస్టీ ఉన్నతి పథకం కింద రూ.50వేల నుంచి రూ.2లక్షలు వరకు.. అవసరమైతే రూ.10 లక్షలు’ కూడా ఇస్తారంటున్నారు. చాలామంది మహిళలు పేపర్ ప్లేట్స్, దినుసుల పొడులు, డెయిరీ, ఫ్యాన్సీ షాపులు, పచ్చళ్ల తయారీ, టీషర్టులు, హోటళ్లు వంటివి పెట్టుకున్నారు. వీరి పరిశ్రమలకు సంబంధించి ఫోటోలు, వీడియోలు యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు.. పరిశ్రమలు పెట్టారో లేదో తెలుస్తుందంటున్నారు. ఆసక్తి ఉన్న మహిళలు డీఆర్డీఏ అధికారుల్ని సంప్రదిస్తే మరిన్ని వివరాలు చెప్తారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.