సరికొత్త రంగుల్లో ఆ రెండు స్కూటర్లు రిలీజ్ చేసిన సుజుకీ.. కలర్ కాంబినేషన్ అదిరిపోయిందిగా..!

www.mannamweb.com


భారతదేశంలో ఇటీవల కాలంలో స్కూటర్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంత ప్రజలు స్కూటర్ల కొనుగోలుకు ముందుకు వస్తున్నారు. అయితే ఇటీవల స్కూటర్ల మార్కెట్‌లోకి ఎలక్ట్రిక్ వాహనాల హవాతో పెట్రోల్‌తో నడిచే స్కూటర్లను కంపెనీలు రిలీజ్ చేయడంలో వెనుకంజ వేస్తున్నాయి.

దాదాపు మూడునాలుగు సంవత్సరాలుగా సరిగ్గా ఓ కొత్త మోడల్ పెట్రోల్ స్కూటర్ రిలీజ్ కాలేదంటే ఈవీలపై కంపెనీలు ఎంత ఆసక్తి చూపుతున్నాయో? అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రముఖ కంపెనీ సుజుకీ పెట్రోల్ వాహనాల పరిధిని విస్తరిస్తూ ఆ కంపెనీకు సంబంధించిన రెండు స్కూటర్లను సరికొత్త రంగులతో లాంచ్ చేసింది. సుజుకీ బర్గ్ మాన్ స్ట్రీట్, యాక్సెస్ 125 స్కూటర్లను సరికొత్త రంగులతో అందుబాటులోకి తీసుకుంది. నయా కలర్స్‌తో అందుబాటులో ఉన్న ఈ స్కూటర్లు కచ్చితంగా స్కూటర్ ప్రియులను ఆకట్టుకుంటాయని సుజుకీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సుజుకీ బర్గ్ మాన్ స్ట్రీట్, యాక్సెస్ 125 స్కూటర్ల గురించి వివరాలను తెలుసుకుందాం.

సుజుకి బర్గ్ మాన్ స్ట్రీట్ అద్భుతమైన కొత్త కలర్‌లో అందుబాటులో ఉంది. మెటాలిక్ మ్యాట్ బ్లాక్ కలర్‌లో ఆప్రాన్, సైడ్ ప్యానెల్స్‌పై కాంట్రాస్టింగ్ మెరూన్ ప్యానెల్స్‌తో ప్రధానంగా మాట్ బ్లాక్ ఫినిషింగ్‌ను కలిగి ఉంది. ఈ స్టైలిష్ అప్డేట్ బర్గ్ మాన్ స్ట్రీట్‌కు సంబంధించిన ప్రస్తుత మెకానికల్ స్పెసిఫికేషన్లతో వస్తుంది. ఈ స్కూటర్ ఒక పెప్పీ, ఇంధన సమర్థవంతమైన 124సీసీ, సీవీటీతో జత చేసి వచ్చే ఎయిర్ కూల్డ్ ఇంజన్ ద్వారా శక్తిని పొందుతుంది. విశాలమైన సీటు, విశాలమైన లెడ్రూమ్, 21.5 లీటర్ బూట్, యూఎస్‌బీ సాకెట్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు రైడర్లను విపరీతంగా ఆకట్టుకుంటాయి. బర్గ్మన్ స్ట్రీట్ మార్కెట్‌లో టీవీఎస్ జూపిటర్ 125కు పోటీగా ఉంటుంది.

సుజుకీ యాక్సెస్ 125 కొత్త మెటాలిక్ సోనోమా రెడ్ / పెర్ల్ మిరాజ్ వైట్ పెయింట్ కలర్‌లో వస్తుంది. ఈ బోల్డ్ కాంబినేషన్లో ఆఫ్-వైట్ ప్యానెల్స్, టాన్ సీట్ కవర్‌తో కూడిన థిక్ రెడ్ కలర్‌తో ఆకట్టుకుంటుంది. 125 సీసీ స్కూటర్ సెగ్మెంట్‌లో ఎల్ఈడీ లైటింగ్, సీబీఎస్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ వంటి పీచర్లు ఆకట్టుకుంటాయి. సుజుకి రైడ్ కనెక్ట్ యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన పూర్తి డిజిటల్ ఎల్‌సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఈ స్కూటర్ ప్రత్యేకత. 8.5 బీహఎచ్‌పీ, 10ఎన్ఎం ఉత్పత్తి చేసే 124 సీసీ ఇంజన్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, సింగిల్ రియర్ స్ప్రింగ్, డిస్క్-డ్రమ్ లేదా డ్రమ్-డ్రమ్ బ్రేకింగ్ సెటప్స్ ఈ స్కూటర్ ప్రత్యేకత. కొత్త కలర్ వేరియంట్ ధర రూ. 90,500 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉందని సుజుకీ ప్రతినిధులు చెబుతున్నారు.