T Flight: టీ-ఫ్లైట్ రైలుని టెస్ట్ చేసిన చైనా.. గంటకు ఏకంగా 1000 కి.మీ. వేగమే లక్ష్యంగా

www.mannamweb.com


ప్రయాణ దూరాన్ని తగ్గించడం కోసం సరికొత్త సాంకేతికతను వాడి అత్యంత వేగంగా ప్రయాణించే వాహనాలను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. విమానాలు అత్యంత వేగంతో ప్రయాణిస్తాయి. గంటకు 1000 కి.మీ. వేగంతో ప్రయాణం చేసే విమానాలు ఉన్నాయి. అయితే నేల మీద నడిచే వాటిలో అంత వేగంగా నడిచేవి లేవు. వందే భారత్ రైలు గంటకు 180 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. గౌతమి ఎక్స్ప్రెస్ గంటకు 160 కి.మీ. వేగంతో, శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైలు గంటకు 150 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. రాజధాని ఎక్స్ప్రెస్ గంటకు 140 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. గంటకు 250 కి.మీ. వేగంతో ప్రయాణించే బుల్లెట్ ట్రైన్ ని ప్రస్తుతం ఇండియాలో తయారుచేస్తుంది. ఇండియన్ రైల్వేస్ పర్యవేక్షణలో చెన్నైలో ఉన్న ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ తయారుచేస్తుంది.

అయితే ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే రైలు ఒకటి జపాన్ లో ఉంది. ఎల్0 సిరీస్ మాగ్లెవ్ అనే ట్రైన్ గంటకు 602 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే రైలు ఇదే. తాజాగా చైనా జపాన్ ని బీట్ చేసేలా బుల్లెట్ ట్రైన్ ని రూపొందిస్తుంది. ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్.. టీ-ఫ్లైట్ పేరుతో సూపర్ సోనిక్ హై స్పీడ్ ట్రైన్ ను తయారు చేసింది. ట్రైన్ కమ్ ఫ్లైట్ లాంటిదన్నమాట. చూడ్డానికి ఇది విమానంలా ఉంటుంది కానీ రైలే. వేగంలోనూ విమానానికి పోటీ పడుతుంది. దీన్ని తయారు చేసిన తర్వాత టెస్టింగ్ లో భాగంగా మొదటి దశలో 2 కి.మీ. నడిపించారు. టెస్టింగ్ టైంలో ఇది గంటకు 623 కి.మీ. వేగంతో ప్రయాణించింది.

అయితే చైనా గంటకు 4 వేల కి.మీ. వేగంతో ప్రయాణించేలా ఈ రైలుని తయారు చేస్తుంది. విచిత్రం ఏంటంటే.. ఈ రైలుకి చక్రాలు ఉండవు. ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీతో పట్టాలపై గాల్లో తేలుతూ ప్రయాణిస్తుంది. పట్టాలకు, చక్రాలకు మధ్య ఘర్షణ లేకపోవడం వల్ల వేగంగా ప్రయాణించే వీలు ఉంటుంది. ప్రస్తుతం ప్యాసింజర్ల కోసం సీట్లను సిద్ధం చేస్తున్నారు. బీజింగ్, షాంఘై వంటి మెగా సిటీల్లో ప్రయాణికులను ఈ టీ-ఫ్లైట్ మాగ్లేవ్ ట్రైన్ సిస్టం ద్వారా గంటన్నరలోపు చేర్చాలనే గోల్ పెట్టుకుంది చైనా. ఈ సిటీల మధ్య దూరం 1100 కి.మీ. ఈ దూరాన్ని ప్రస్తుతం ఉన్న హై స్పీడ్ రైళ్లు అందుకోవాలంటే 2 గంటలు పైనే పడుతుంది. వేగంగా వెళ్లే సాంప్రదాయ రైళ్లకి 12 లేదా అంతకంటే ఎక్కువ గంటల సమయం పడుతుంది. ఇక ఈ రైలు సోలార్ ప్యానెల్ ద్వారా కూడా నడుస్తుంది. ప్రస్తుతం 623 కి.మీ. వేగం వద్ద టెస్ట్ చేశారు. రెండవ దశలో వెయ్యి కి.మీ.. ఆఖరి దశలో 4 వేల కిమీ. వేగం వద్ద టెస్ట్ చేయనున్నారు.