Joint Pain Relief: ఈ పదార్థాలు తీసుకుంటే కీళ్ల నొప్పులు పూర్తిగా తగ్గిపోతాయి..!

Joint Pain Remedies: ప్రస్తుత కాలంలో చాలా మంది మోకాళ్ల నొప్పులు, నడిచేటప్పుడు మోకాళ్ల నుంచి శబ్దం రావడం వంటి సమస్యలు కలుగుతున్నాయి. దీనికి ముఖ్య కారణం శరీరంలో క్యాల్షియం లోపం.


ఈ లోపం కారణంగా ఎముకలు బలహీనంగా ఉండడం వంటి సమస్యలు కలుగుతాయి. మోకాళ్ల నొప్పి సమస్య నుంచి బయటపడాలి అనుకొనేవారు అనేక రకాల మందులను వాడుతూంటారు. ఇవి తాత్కాలిక ఉపశమనం పొందడానికి తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. అయితే ఈ సమస్య నుంచి బయటపడాలి అనుకొనేవారు కొన్ని ఆయుర్వేద చట్కాలను పాటించడం వల్ల త్వరగా ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఈ మోకాళ్ల నొప్పి సమస్యల నుంచి ఉపశమనం పొందాలి అనుకొనేవారు మూడు రకాల పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం నల్ల బెల్లం, అర కప్పు పుట్నాలు, ఒక గ్లాస్‌ పాలు తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని కలిపి తీసుకోవడం ఎముకలు దృఢంగా తయారు అవుతాయి. నల్ల బెల్లంలో ఉండే ఫాస్పరస్‌ కండరాలను, ఎముకలను బలంగా తయారు చేస్తుంది. అంతేకాకుండా శరీరంలో ఉండే వ్యర్థలను తొలగించడంలో ఎంతో సహాయపడుతుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు కూడా ఈ సమస్యను నుంచి బయటపడవచ్చు. జీర్ణవ్యవస్థతో బాధపడేవారికి దీని తీసుకోవడం వల్ల మలబద్ధకం, గ్యాస్‌, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. కీళ్ల నొప్పులు తగ్గడంతో పాటు మరలా రాకుండా ఉంటాయి.

మోకాళ్ల నుంచి శబ్దాలు రావడం కూడా తగ్గుతాయి. అయితే వీటిని మధ్యాహ్నం భోజనం చేసిన రెండు గంటల తరువాత తీసుకోవడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మోకాళ్ల నొప్పులు తగ్గడంతో పాటు జ్ఞాపకశక్తి పెరుగుతుంది. శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. అలాగే దీంతో పాటు మెంతులను తీసుకోవడం వల్ల మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అయితే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి.

అలాగే కీళ్ల నొప్పులతో బాధపడేవారు మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు వీటని తీసుకోవచ్చు. అయితే మీర వీటిని తీసుకోనేముందు వైద్యుడిని సంప్రదించడంలో చాలా మంచిది. వీటితో పాటు క్యాల్షియంతో కూడిన ఆ హారపదార్థాలు తీసుకోవడం చాలా అవసరం. దీని వల్ల ఎముకలకు ఎంతో మేలు కలుగుతుంది. క్యాల్షియంతో పాటు ఇతర విటమిన్‌లు, మినరల్స్‌ కూడిన పదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెబుతున్నారు.