టాంగా ఆటో వచ్చేశాయి.. రూ. లక్ష పెడితే చాలు

www.mannamweb.com


ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్ తయారీ సంస్థ (Zelio eBikes) మరో సరికొత్త మోడల్స్‌తో మార్కెట్లోకి వచ్చేసింది. అయితే ఈసారి టూ వీలర్స్‌తో కాదండోయ్! గేరు మార్చి, త్రీ వీలర్స్‌తో ఎంట్రీ ఇచ్చింది.

టాంగా బటర్ ఫ్లై(Tanga Butterfly), టాంగా ఎస్‌ఎస్ (Tanga SS) అనే పేరుతో తమ బ్రాండ్ నుంచి తొలిసారి రెండు ఆటోలను లాంఛ్ చేసింది. అదిరిపోయే లుక్స్‌తో ఉన్న ఈ ఎలక్ట్రిక్ ఆటోలు అర్బన్, సెమీ అర్బన్ కస్టమర్స్‌కు ఫర్‌ఫెక్ట్‌ ఛాయిస్‌గా ఉండనున్నాయి. ఈ ఇ- ఆటో రిక్షాల ధర, ఫీచర్లను ఇప్పుడు చూద్దాం.

ఈ రెండు ఆటో మోడల్స్‌ను గత నెలలో దిల్లీలో జరిగిన ఈవీ ఇండియా ఎక్స్‌పో 2024లో తొలిసారి ప్రదర్శించింది జీలియో సంస్థ. ఈ ఆటోలను ఇప్పుడు వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆటోలు SMPS ఛార్జర్‌తో అందుబాటులో ఉంటాయి. దీనిద్వారా వోల్టేజ్ ఫ్లక్చువేషన్ నుంచి రక్షణతో పాటు ఎఫీషియంట్ ఛార్జింగ్ సౌకర్యం లభిస్తుంది.

ఈ ఆటోల ధరల విషయానికి వస్తే.. టాంగా బటర్ ఫ్లై మోడల్‌ను మైల్డ్ స్టీల్‌తో తయారు చేశారు. దీని ధర రూ.1,45,000 (ఎక్స్ షోరూమ్) గా ఉంది. ఇక టాంగా ఎస్ఎస్ మోడల్.. స్టెయిన్ లెస్ స్టీల్‌తో తయారైంది. దీని ధర రూ.1,40,000గా ఉంది. అంతేకాకుండా ఈ మోడల్స్‌కు సంబంధించి ఫైర్ ఎక్సుంగుషర్, ఫస్ట్ ఎయిడ్ కిట్, టూల్ కిట్, జాక్ వంటి స్టాండర్డ్ యాక్సెసరీస్‌ను అందిస్తోంది ఆ సంస్థ.

ఫీచర్లు.. ఈ రెండు మోడల్ ఆటోలు వైపర్‌తో కూడిన వైడ్ ఫ్రంట్ గ్లాస్‌తో వస్తాయి. దాంతోపాటు సెంట్రల్ లాకింగ్, హెవీ కర్టెన్స్, టాక్సీ లైట్, ఎల్ఈడీ కార్బన్ లైట్, స్టెపినీ, హ్యాండిల్ లాక్, ఎఫ్ఎం రేడియో, డ్యూయల్ స్పీకర్స్, డిజిటల్ మీటర్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, డీఆర్ఎల్ ఎల్ఈడి ఇండికేటర్స్, బాటిల్ వంటి సదుపాయాలతో లభిస్తాయి.

ఇవి భిన్నమైన కలర్‌ ఆప్షన్స్‌తో అందుబాటులోకి తెచ్చింది Zelio సంస్థ. టాంగా ఎస్ఎస్ మోడల్‌ ప్యారట్ గ్రీన్, ఎరుపు, నీలం, స్కై బ్లూ, గ్రే వంటి కలర్ ఆప్షన్స్‌తో అందుబాటులో ఉంది. టాంగా బటర్ ఫ్లై.. రెడ్‌, గ్రే, తెలుపు, స్కై బ్లూ మిలిటరీ గ్రీన్ కలర్స్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ ఆటోలలో 48/60V 135Ah ఈస్ట్‌మన్ బ్యాటరీ.. ఫుల్‌ ఛార్జ్‌ కోసం 8 గంటల సమయం పడుతుంది.

స్మూత్ రైడ్ కోసం.. 43 ఎంఎం టెలిస్కోపిక్ హైడ్రాలిక్ షాకర్స్ ఫ్రంట్‌లో ఉండగా.. లీఫ్- స్ప్రింగ్ షాకర్స్ వెనుకవైపు ఉంటాయి. టాంగా బటర్ ఫ్లై, టాంగా ఎస్ఎస్ ఆటోలు రెండూ అడ్వాన్స్‌డ్ బ్రేకింగ్ సిస్టమ్స్‌తో అందుబాటులో ఉన్నాయి. ఫ్రంట్ లివర్ ఆపరేటర్ డ్రమ్ బ్రేక్, రేర్ -పెడల్ ఆపరేటర్ డ్రమ్ బ్రేక్‌తో పాటు మెకానికల్ హ్యాండ్ లివర్ ఆపరేటర్ పార్కింగ్ బ్రేక్ సదుపాయం కూడా ఇందులో ఉంది.

ఇది 2030 వీల్ బేస్‌తో ఈ ఆటోలో కలదు. అంతే కాకుండా 2690 mm పొడవు, 1000 mm వెడల్పు.. 1710 మిల్లీ మీటర్ల ఎత్తుతో వస్తుంది. దీంతో పాటు 200 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్ ఆప్షన్ ఇందులో కలదు. ఈ రెండు ఆటోలు TVS 3.75 -12 టైర్లతో వస్తాయి. మోనోకోక్ ఫ్రేమ్‌తో దీని ఛాసిస్ ఉంటుంది.

సేఫ్టీ, పర్ఫామెన్స్, కంఫర్ట్‌కు సంబంధించి అత్యున్నత ప్రమాణాలను అనుసరించి తమ వాహనాలను డిజైన్ చేసినట్లు జీలియో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, కో ఫౌండర్ కునాల్ ఆర్య పేర్కొన్నారు. టాంగా బటర్ ఫ్లై, టాంగా ఎస్ఎస్ మోడల్స్ ఆటోలతో.. భారత ఈవీ రంగంలో తాము సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించనున్నామని ఆయన అన్నారు.