స్టార్ హీరో విక్రమ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ తంగలాన్. థియేటర్స్ లో ఈ మంచి విజయాన్ని అందుకుంది. ఈ ప్రేక్షకులను మెప్పించింది. ప్రయోగాలకు విక్రమ్ కేరాఫ్ అడ్రస్ అనే చెప్పాలి.
ఇదిలా ఉంటే తంగలాన్ ఓటీటీ విడుదల పై చిక్కొచ్చి పడింది. తంగలాన్ ఓటీటీ విడుదలపై నిషేధం లేదని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. తిరువళ్లూరుకు చెందిన పోర్కోడి మద్రాసు హైకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు చేశారు. రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ తదితరులు నటించిన తంగలాన్ లో వైష్ణవులను కించపరిచే సన్నివేశాలున్నాయని వచ్చాయి. బౌద్ధాన్ని పవిత్రంగా, వైష్ణవాన్ని జోక్‌గా చిత్రీకరించే సన్నివేశాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే థియేటర్లలో ను విడుదల చేయగా, త్వరలో ఓటీటీలో విడుదల చేస్తామని, విడుదల చేస్తే ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసే సన్నివేశాలు ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు.
అందువల్ల ఓటీటీలో తంగలాన్ విడుదలను నిషేధించాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీరామ్, జస్టిస్ సెంథిల్ కుమార్ రామమూర్తిలతో కూడిన ధర్మాసనం సెన్సార్ సర్టిఫికేట్ పొంది చిత్రం విడుదలైనందున తంగలాన్ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడానికి ఎలాంటి అడ్డంకి లేదని ఆదేశిస్తూ కేసును కొట్టివేసింది.
2021లో ప్రారంభమైన ఈ చిత్రం 2023లో పూర్తయింది. విడుదల తేదీని వరుసగా మూడు వాయిదాల తర్వాత ఈ చిత్రం ఆగస్టు 15న థియేటర్లలోకి వచ్చింది. స్టూడియో గ్రీన్, నీలం ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో విక్రమ్, పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్, పశుపతి తదితరులు నటించారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రం కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది.