రూ.6.14లక్షల ధరతో టాటా పంచ్‌కు గట్టి పోటీ.. ఈ ఒక్క కారుతోనే నెట్టుకొస్తున్న కంపెనీ

 భారతదేశం ప్రపంచంలోని ఆటోమొబైల్ మార్కెట్లో టాప్ ప్లేసులో ఉంటుంది. అందుకే దేశవిదేశాలకు చెందిన కంపెనీలు ఇక్కడ మార్కెట్ పెంచుకోవాలని అనుకుంటాయి.


ప్రస్తుతం ఆటోమొబైల్ మార్కెట్‌లో నిస్సాన్ సంస్థ ఇప్పుడు ఒకే ఒక కారు అమ్మకాలతో నెట్టుకొస్తుంది. దాని పేరే నిస్సాన్ మాగ్నైట్. ఈ కారు అమ్మకాలు పెద్దగా లేనప్పటికీ, దేశంలో అత్యంత చవకైన ఎస్‌యూవీలలో ఒకటిగా దీనికి మంచి గుర్తింపు ఉంది. నిస్సాన్ పోర్ట్‌ఫోలియోలో ఎక్స్-ట్రయల్ వంటి ఇతర మోడల్స్ ఉన్నప్పటికీ వాటికి అనుకున్నంత డిమాండ్ లేదు. గత ఆరు నెలల్లో చూస్తే మూడు నెలల పాటు వాటికి ఒక్క కస్టమర్ కూడా రాలేదు. వాటికి ఒక్క కస్టమర్ కూడా రాలేదు. దీంతో నిస్సాన్ భవిష్యత్తు మొత్తం మాగ్నైట్‌పైనే ఆధారపడి ఉందని చెప్పవచ్చు.

నిస్సాన్ మాగ్నైట్ 2020లో లాంచ్ అయిన తర్వాత నుంచి బాగా పాపులర్ అయింది. ఇప్పటివరకు ఈ ఎస్‌యూవీ 2 లక్షల యూనిట్లకు పైగా అమ్ముడుపోయింది. ఇది కంపెనీకి ఒక పెద్ద విజయంగా చెప్పొచ్చు. ఈ విజయానికి కారణం దీని తక్కువ ధర, అదిరిపోయే ఫీచర్లు. మాగ్నైట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ.6.14 లక్షలు మాత్రమే. ఈ ధరలో టాటా పంచ్, టాటా నెక్సాన్, హ్యుందాయ్ ఎక్స్‌టర్, మారుతి ఫ్రాంక్స్ వంటి వాటికి గట్టి పోటీ ఇస్తోంది.

నిస్సాన్ మాగ్నైట్‌కు ఇటీవల కొత్త అప్‌డేట్‌లు వచ్చాయి. అలాగే, ఇది ఇప్పుడు సీఎన్‌జీ వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉంది. దీని ధర స్టాండర్డ్ వేరియంట్ కంటే రూ.75,000 ఎక్కువ. నిస్సాన్ మాగ్నైట్ 1.0-లీటర్ నాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌లతో వస్తుంది. 1.0-లీటర్ ఇంజిన్ 71bhp పవర్, 96Nm టార్క్ ఇస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

ఈ కారులో వైర్‌లెస్ ఛార్జర్, 360డిగ్రీ వ్యూ మానిటర్, కొత్త ఐ-కీ, వాక్ అవే లాక్, రిమోట్ ఇంజిన్ స్టార్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అద్భుతమైన డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్ కోసం 360-డిగ్రీ లెదర్ టచ్ ఇంటీరియర్, హీట్ ఇన్సులేషన్ కోటింగ్ ఉన్న సీట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ పరంగా చూస్తే ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, అలాగే అనేక ఇతర సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

నిస్సాన్ మాగ్నైట్ పెద్ద 540 లీటర్ల బూట్ స్పేస్‌తో వస్తుంది. ఇది ఒక ఎస్‌యూవీకి చాలా మంచి స్టోరేజ్ కెపాసిటీ అని చెప్పొచ్చు. ఇందులో 4 యాంబియంట్ లైటింగ్‌లు, ఆటో డిమ్మింగ్ ఫ్రేమ్‌లెస్ ఇన్‌సైడ్ రియర్‌వ్యూ మిర్రర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కోరుకునే వాళ్లకు మాత్రం ఈకారు ఒక మంచి ఆప్షన్.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.