గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని కంపెనీల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఫ్రెషర్స్, ఎక్స్‌పీరియన్స్‌డ్ పొజిషన్ల భర్తీ కోసం ప్రముఖ ఐటీ సర్వీసెస్, కన్సల్టింగ్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) భారీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ చేపట్టింది.
వివిధ డొమైన్లలో అనుభవం ఉన్న ప్రొఫెషనల్స్, టాలెంటెడ్ ఫ్రెషర్స్‌ను ఈ డ్రైవ్ ద్వారా కంపెనీ రిక్రూట్ చేసుకోనుంది. దేశవ్యాప్తంగా ఉన్న టీసీఎస్ కంపెనీ లొకేషన్లలో ఈ మెగా వాకిన్ ఇంటర్వ్యూలు (Mega Walk-in Interview) నిర్వహించనుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే సంబంధిత డాక్యుమెంట్స్, రెజ్యుమ్ ప్రిపేర్ చేసుకుని ఈ వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ కావాలని కంపెనీ వెల్లడించింది.
* ఫ్రెషర్స్ హైరింగ్
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న టీసీఎస్ క్యాంపస్‌లో ఫ్రెషర్స్ కోసం మెగా వాకిన్ ఇంటర్వ్యూ డ్రైవ్ జరగనుంది. 2025, ఫిబ్రవరి 1న ఈ డ్రైవ్ ఉండనుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వాకిన్ ఇంటర్వ్యూలు జరుగుతాయి. గచ్చిబౌలిలోని సినర్జీ పార్కులో ఉన్న టీసీఎస్ సీఎమ్ఎసీ(TCS CMC) క్యాంపస్‌ను సంప్రదించి అభ్యర్థులు వాకిన్ ఇంటర్వ్యూకి హాజరు కావాలి. రెగ్యులర్ ఎడ్యుకేషన్‌లో ఎలాంటి గ్యాప్ లేకుండా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఇందుకు అర్హులు. అది కూడా ఫుల్ టైం కోర్సులు పూర్తి చేసిన వారినే ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు కింద ఇచ్చిన లింక్ ద్వారా వాకిన్ ఇంటర్వ్యూకి రిజిస్టర్ చేసుకోవచ్చు.
* ఈ క్యాంపస్‌లలో కూడా
ముంబై, బెంగుళూరు, నొయిడా, పూణె కేంద్రంగా ఉన్న క్యాంపస్‌లలో గ్రాడ్యుయేట్ ఎంట్రీ లెవెల్ నుంచి ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న అభ్యర్థుల కోసం మెగా వాకిన్ ఇంటర్వ్యూ డ్రైవ్ జరగనుంది. ఇక్కడ కూడా ఫిబ్రవరి 1నే టీసీఎస్ డ్రైవ్ నిర్వహించనుంది. BE/ B.Tech/ MCA/ M.Sc/ MS పూర్తి చేసిన తర్వాత కనీసం రెండేళ్ల ఐటీ అనుభవం తప్పనిసరి. B.Sc/ BCA క్యాండిడేట్లయితే గ్రాడ్యుయేషన్ అనంతరం ఐటీ రంగంలో కనీసం రెండున్నరేళ్ల పాటు పనిచేసిన అనుభవం ఉంటే ప్రయారిటీ ఇస్తారు. రెగ్యులర్ ఎడ్యుకేషన్‌లో గ్యాప్ ఉండకూడదు. వరుసగా కనీసం 15 ఏళ్లు(10+2+3) రెగ్యులర్ విధానంలో ఫుల్ టైం కోర్సులు చేసి ఉండాలి. పూణెలోని సహ్యాద్రి పార్క్ 1 ఆఫీస్ జోన్ ఇందుకు వేదిక.
నొయిడా క్యాంపస్
నొయిడా క్యాంపస్‌లో కూడా ఫిబ్రవరి 1న మెగా వాకిన్ ఇంటర్వ్యూ డ్రైవ్ ఉండనుంది. సెక్టార్ 135లోని టీసీఎస్ యమున టవర్ ఇందుకు వేదిక. ఆసక్తి గల అభ్యర్థులు ఒక అప్డేటెడ్ రెజ్యుమె, ఏదైనా ప్రభుత్వ గుర్తింపు సర్టిఫికెట్, 1 పాస్‌ఫొటో, కొవిడ్-19 డబుల్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్, టీసీఎస్ అప్లికేషన్ ఫారంలతో ఇంటర్వ్యూకి హాజరు కావాలి.