ఒక్కోసారి అనుకోకుండా బట్టలపై టీ మరకలు అనేవి పడుతూ ఉంటాయి. ఇలా బట్టలపై పడ్డ మరకలు అంత ఈజీగా పోవు. మరకలు అలానే ఉంటాయి. దీంతో ఆ బట్టలు వేసుకోకుండా పక్కన పెట్టేస్తారు.
కానీ ఎలాంటి మొండి టీ మరకలు అయినా సరే ఎంతో సింపుల్‌గా, కొన్ని టీ మరకలతో పోగొట్టవచ్చు. మరి చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
బ్లీచింగ్ పౌడర్ సహాయంతో డ్రెస్సులపై పడ్డ టీ మరకలను తొలగించుకోవచ్చు. ముందుగా కాఫీ, టీ పడిన మరకలపై బ్లీచింగ్ పౌడర్ రుద్దాలి. బ్లీచింగ్ పౌడర్ ఎక్కువగా వాడితే బట్టలు అనేవి పాడైపోతాయి. కాబట్టి కేవలం మరకలు పడిన చోట మాత్రమే కొద్దిగా వేసి రుద్దండి. ఆ తర్వాత వెంటనే నీటితో క్లీన్ చేయాలి.
వెనిగర్ సహాయంతో కూడా టీ, కాఫీ మరకలను వదిలించుకోవచ్చు. మరకలు పడిన చోట వెనిగర్ వేసి రుద్దండి. ఆ తర్వాత కాసేపు సర్ఫ్ వేసి గోరు వెచ్చటి నీటిలో నానబెట్టాలి. ఇలా ఓ గంట తర్వాత మళ్లీ సబ్బు రుద్ది బ్రష్ కొడితే మరకలు పోతాయి.
టీ, కాఫీ లాంటి మొండి మరకలను బేకింగ్ సోడాతో కూడా వదిలించుకోవచ్చు. మరకలు పడ్డ చోట బేకింగ్ సోడా వేసి రుద్దాలి. ఆ తర్వాత నీటిలో కాసేపు నానబెట్టాలి. ఓ గంట తర్వాత సబ్బుతో మరకలను రుద్ది.. నీటితో శుభ్రం చేసి ఎండలో ఆరబెట్టాలి.
మనం ఉపయోగించే పౌడర్ సహాయంతో కూడా మరకలను పోగొట్టవచ్చు. టీ పడిన వెంటనే టిష్యూ పేపర్‌తో టీ మరకలను తుడిచేసి. సబ్బుతో రుద్ది.. బ్రష్ కొడితే మరకలు పోతాయి. ఆ తర్వత ఇక్కడ తడిగా ఉండే ప్రదేశంలో పౌడర్ చల్లండి. ఇలా చేయడం వల్ల మరకలు కనిపించవు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)