Viral: దేవుడా.. ఎక్కాలు ఇలాక్కూడా నేర్చుకోవచ్చా? ఇన్నాళ్లూ అనవసరంగా బట్టీ కొట్టామే!

పిల్లలకు ఎక్కాలు నేర్పించేందుకు ఓ టీచర్ కనిపెట్టిన కొత్త టెక్నిక్ నెట్టింట వైరల్‌గా మారింది.


గణితం అంటే చాలా మంది విద్యార్థులు భయపడతారు కానీ కరెక్ట్ టీచర్ దొరికితే మాత్రం చదువంతా నల్లేరు మీద నడకే అయిపోతుంది. కానీ, అలాంటి టీచర్లు దొరకడం చాలా అరుదు. అయితే, సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడెక్కడో దాగున్న టాలెంట్ అంతా జనాలు ముందుకొచ్చేస్తోంది. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి జనాలను బాగా సర్‌ప్రైజ్ చేస్తోంది. వీడియోలోని టీచర్ ఎక్కాలు నెర్పించేందుకు ఫాలో అవుతున్న టెక్నిక్ చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఈ చిన్ని సూత్రం తెలీక ఇన్నాళ్లూ అనవసరంగా టేబుల్స్ బట్టీ కొట్టామంటూ వాపోతున్నారు (Teacher follows unique technique to help pupils learn tables).

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఆ మాస్టారు మొదట ఒకటి నుంచి పది వరకూ అంకెలను బోర్డు మీద పై నుంచి కిందకు రాశారు. ఆ తరువాత మళ్లీ ఒకటి తరువాత అంకెలను లెక్కబెడుతూ మొదటి వరుస పక్కన ఖాళీల్లో నింపుతూ వెళ్లారు. దీంతో, రెండు ఎక్కం అయిపోయింది. ఇదే పద్ధతిలో మూడో ఎక్కం, నాలుగో ఎక్కం కూడా పూర్తి చేశాడు. టీచర్ చెబుతున్న టెక్నిక్ సులభంగా ఉండటంతో ఆయన కంటే ముందే స్టూడెంట్లు ఒక్కో టేబుల్‌లోని సంఖ్యలను చెప్పుకుంటూ వెళ్లిపోయారు.

ఇదంతా చూసిన జనాలు కూడా ఆశ్చర్యపోతున్నారు. పిల్లలకు టేబుల్స్‌ సులువుగా అర్థమయ్యేందుకు మాస్టారు కనిపెట్టిన టెక్నిక్ అద్భుతంగా ఉందంటూ ప్రశంసిస్తున్నారు. ఈ టెక్నిక్ గురించి ముందే తెలిసుంటే ఇంతకాలం టేబుల్స్ బట్టీ కొట్టేవాళ్లం కాదని మరికొందరు చెప్పుకొచ్చారు. ఇలా రకరకాల కామెంట్‌ల మధ్య ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ కొత్త టెక్నిక్‌పై మీరూ ఓ లుక్కేయండి.

వీడియో చూడండి