స్కూల్ వాట్సప్ గ్రూప్ చూడట్లేదని టీచర్ సస్పెన్షన్.

వాట్సాప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయ్యాడని టీచర్ సస్పెన్షన్..!


విజయవాడ : వాట్సాప్ చూడటం లేదని ఓ టీచర్ ని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. స్కూల్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయ్యాడని మరో కారణం చెప్పారు. ఈ ఉత్తర్వులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విజయవాడలోని మొగల్రాజపురంలో బీఎస్ఆర్కే మున్సిపల్ హైస్కూల్‌లో పని చేస్తున్న ఎల్‌ రమేష్ అనే ఉపాధ్యాయుడ్ని సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి ఉత్తర్వులు జారీ చేశారు.

ఇందులో విద్యాశాఖాధికారి చెప్పినప్రధాన కారణం… సదరు ఉపాధ్యాయుడు ఎల్ రమేష్ కొంత కాలం గా ఆరోగ్య సమస్య తో వాట్సాప్ చూడటం లేదట. అంతే కాదు స్కూల్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయ్యారట. స్కూల్ గ్రూపు నుంచి ఎగ్జిట్ అయి.. వాట్సాప్ చూడకపోవడం వల్ల…ఉన్నతాధికారులు ఇచ్చే ఆదేశాలను ఆయన మిస్ అవుతున్నారని అంటున్నారు. ఆయనతో కమ్యూనికేట్ చేయడం కష్టంగా ఉందని.. చెబుతున్నారు.

ఇలా ఎందుకు చేశారని ఎల్ రమేష్ ను పై అధికారులు వివరణ కూడా అడిగారు. అయితే తనకు కంటి సమస్య ఉందని మొబైల్ ఫోన్ ను అదే పనిగా వాడవద్దని.. ముఖ్యంగా వాట్సాప్ చూడవద్దని వైద్యుడు సూచించారని రమేష్ వివరణ ఇచ్చారు.

అయితే ఆయన నోటి మాటగానే ఈ వివరణ ఇచ్చారని.. వైద్యుడు ఇచ్చిన సూచనల డాక్యుమెంట్లు సమర్పించలేదని వివరణ తీసుకున్న అధికారి తేల్చారు. ఇది పూర్తిగా నిర్లక్ష్యమేనని అందుకే ఆయనను సస్పెండ్ చేయాల్సిందేనని తీర్మానించి.. నిర్ణయం తీసుకున్నారు.

అధికారుల ఉత్తర్వులు వైరల్ గామారాయి. వాట్సాప్ వాడకపోవడం తప్పు ఎలా అవుతుందన్న ప్రశ్నలు ఉపాధ్యాయ వర్గాల్లోనే వస్తున్నాయి. కమ్యూనికేషన్ ను వాట్సాప్ ద్వారా చేయడం అనేది ఓ ఆప్షనే కానీ.. అదేమీ నిర్బంధం కాదని.. చెబుతున్నారు. వాట్సాప్ లు లేక ముందు కూడా స్కూళ్లు, ఉపాధ్యాయులు ఉన్నారని గుర్తు చేస్తున్నారు.

స్మార్ట్ ఫోన్ వాడాలా వద్దా అన్నది వ్యక్తిగత ఇష్టం.. వాట్సాప్ ఉన్న వారికి ఆదేశాలు వాట్సాప్ లో ఇచ్చి.. లేని వారికి.. మరో పద్దితలో సమాచారం ఇస్తే సరిపోయేదానికి ఇలా సస్పెన్షన వేటు వేయడమేమిటన్న ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

అయితే విద్యాశాఖ మంత్రి ఆదేశాలు తో అధికారులు మాత్రం.. ఆ ఉపాధ్యాయుడు విధుల్లో పూర్తి స్థాయి నిర్లక్ష్యంగా ఉంటున్నారని.. వాట్సాప్ లో ఉండకపోవడం కూడా కారణమని అంటున్నారు. ఏది ఏమైనా.. ఉపాధ్యాయులు ఈ ఉత్తర్వులను చూపించి పై అధికారులు ఎలా వేధిస్తున్నారో ఇంత కంటే సాక్ష్యం ఉంటుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నారు.

అమరావతి: విజయవాడలోని మొగల్రాజపురం BSRK ఉన్నత పాఠశాల ఉపాధ్యా యుడు.. స్కూల్ వాట్సాప్ గ్రూప్ లోని మెసేజ్ లు చూడడం లేదని ఆయనను సస్పెండ్ చేయడం వివాదాస్పదంగా మారింది.

దీనిపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే సస్పెన్షన్ను రద్దు చేయాలంటూ.. జిల్లా విద్యాశాఖ అధికారులకు యూటీ ఎఫ్ ఆధ్వర్యంలో శనివారం వినతిపత్రం అందజేశారు.

తనకు కంటి సంబంధిత సమస్య ఉండడంతో స్మార్ట్ మొబైల్ వాడొద్దని వైద్యులు సూచించారని రమేష్ వివరణ ఇచ్చినా.. వ్యక్తిగత విషయాన్ని సాకుగా చూపిస్తూ సస్పెండ్ చేయడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.

దీనిపై జిల్లా విద్యాశాఖాధికారి యు.వి.సుబ్బారావు మాట్లా డుతూ.. వాట్సప్ గ్రూపు నుంచి రమేష్ అకస్మాత్తుగా వెళ్లి పోవడం, విధినిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండడం, కంటి సమస్య ఉన్నట్లు వైద్యులు సూచించిన ధ్రువీకరణపత్రాలు సమర్పించాలని కోరినా స్పందించకపోవడం వల్లే ఆయ నపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.