దిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (DSSSB) వివిధ సబ్జెక్టులలో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGTలు) రిక్రూట్‌మెంట్ కోసం ప్రకటనను విడుదల చేసింది. దిల్లీ లోని ఎన్‌సిటి ప్రభుత్వ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇతర అనుబంధ సంస్థలలో 432 ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 14వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టు- ఖాళీల వివరాలు:
పీజీటీ (హిందీ) – 91
పీజీటీ (గణితం) – 31
పీజీటీ (ఫిజిక్స్) – 5
పీజీటీ (కెమిస్ట్రీ) – 7
పీజీటీ (బయాలజీ) – 13
పీజీటీ (ఎకనామిక్స్) – 82
పీజీటీ (కామర్స్) – 37
పీజీటీ (చరిత్ర) – 61
పీజీటీ (జాగ్రఫీ) – 22
పీజీటీ (పొలిటికల్ సైన్స్) – 78
పీజీటీ (సోషియాలజీ) – 5
మొత్తం ఖాళీల సంఖ్య: 432
అర్హత: అభ్యర్థులు తప్పనిసరిగా బీఎడ్ (B.Ed)తో పాటు సంబంధిత సబ్జెక్టులో కనీసం 50% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా ఎన్‌సీటీఈ గుర్తింపు కలిగిన తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు.
జీతం: రూ.47,600 – రూ.1,51,100 (పే లెవెల్-8), గ్రూప్ ‘బి’ (నాన్ గెజిటెడ్) పే స్కేల్ అందుకుంటారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: సీబీటీ ఎగ్జామ్, మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: 16 జనవరి 2025
దరఖాస్తుకు చివరి తేదీ: 14 ఫిబ్రవరి 2025