కొత్త సంవత్సరం మొదలైన తర్వాత టెక్ కంపెనీల్లో రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్ క్రమంగా పెరుగుతున్నాయి. రీసెంట్‌గా టీసీఎస్, కాగ్నిజెంట్ కంపెనీలు ఫ్రెషర్స్, ఎక్స్‌పీరియన్స్‌డ్ పొజిషన్ల భర్తీ కోసం మెగా వాకిన్ ఇంటర్వ్యూ డ్రైవ్‌లను నిర్వహిస్తున్నట్లు ప్రకటించాయి.
ఈ వాకిన్ ఇంటర్వ్యూల ద్వారా వివిధ పోస్టులను భర్తీ చేయనున్నాయి. తాజాగా, ఈ జాబితాలోకి టెక్ మహీంద్రా(Tech Mahindra) చేరింది. డిగ్రీ పూర్తి చేసిన వారికోసం ఎంట్రీ లెవెల్ రోల్స్ ఆఫర్ చేస్తోంది. వీరితో పాటు వర్క్ ఫ్రం హోం ఫెసిలిటీతో అనుభవం ఉన్న ఉద్యోగులను సైతం వివిధ పొజిషన్స్ కోసం హైరింగ్ నిర్వహించనుంది.
* వీటిల్లో ఖాళీలు
వివిధ విభాగాల్లో టెక్ మహీంద్రా పోస్టులను భర్తీ చేయనుంది. కస్టమర్ సర్వీస్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్, ఎంటర్‌ప్రైజ్ ఎవల్యుయేషన్ వంటివాటిల్లో ఎంట్రీ లెవెల్ ఉద్యోగులను హైర్ చేసుకోనుంది. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, యుకే కస్టమర్ సర్వీస్, యుకే వాయిస్ ప్రాసెస్, యుఎస్ వాయిస్ ప్రాసెస్, ఇంటర్నేషనల్ చాట్ ప్రాసెస్, ఇంటర్నేషనల్ నాన్ వాయిస్ ప్రాసెస్, హిందీ వాయిస్ ప్రాసెస్, ఆస్ట్రేలియన్ వాయిస్ ప్రాసెస్, వాయిస్ కోచ్, ప్రాసెస్ ట్రైనర్‌ల పోస్టులను విడిగా రిక్రూట్ చేయనుంది.
వీటితో పాటు టెలికాలింగ్, డొమొస్టిక్ వాయిస్ ప్రాసెస్, టెలీసేల్స్, బీపీవో వాయిస్, సేల్స్ వంటి పోస్టుల కోసం మెగా వాకిన్ డ్రైవ్ చేపట్టనుంది. వీటితో పాటు ఫ్రంట్ ఎండ్/బ్యాక్ ఎండ్ సాఫ్ట్‌వేర్ డెవలపర్, ఫుల్‌స్టాక్ డెవలపర్, వీటికోసం ఫ్రెషర్స్‌తో పాటు కనీసం 4 ఏళ్ల అనుభవం కలిగిన ఉద్యోగుల నుంచి అప్లికేషన్లను స్వీకరించనుంది.
* ఫ్లెక్సిబుల్ టైమింగ్స్
ఆయా పొజిషన్లను బట్టి కంపెనీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం, వర్క్ ఫ్రం ఆఫీస్, హైబ్రిడ్ పాలసీ ఆఫర్ చేస్తున్నాయి. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్లకు పూర్తిగా ఇంటి నుంచే పనిచేసుకునే ఫెసిలిటీ కల్పిస్తోంది. ఇక ఎంపికైన ఉద్యోగులు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్‌లో వర్క్ చేయొచ్చు. మూడు షిఫ్టుల్లో పనిచేసుకునే సౌలభ్యం ఉంది. దీంతో పాటు దేశవ్యాప్తంగా టెక్ మహీంద్రా బ్రాంచ్‌లలో ఒకదానిని ఎంచుకోవచ్చు. హైదరాబాద్, ముంబై, నొయిడాలలో వివిధ పొజిషన్లకు వేకెన్సీలు ఉన్నాయి.
* జీతం
జాబ్ రోల్, స్కిల్స్ ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు జీతం ఇస్తారు. కస్టమర్ సర్వీస్ విభాగంలో పనిచేసే పొజిషన్లకు సగటుగా ఏడాదికి రూ.3.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వేతనాన్ని ఆఫర్ చేస్తోంది. మిగతా డిపార్ట్‌మెంట్ల ఉద్యోగాలకు సంబంధించి శాలరీ వెల్లడించలేదు. పని అనుభవం ఆధారంగా జీతం డిసైడ్ అవుతుంది.
* వాకిన్ డ్రైవ్
నొయిడాలోని సెక్టార్ 62లో ఉన్న టెక్ మహీంద్రా క్యాంపస్‌లో ప్రస్తుతం మెగా వాకిన్ డ్రైవ్ జరుగుతోంది. ఫిబ్రవరి 2 వరకు ఈ డ్రైవ్ ఉండనుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య సంబంధిత డాక్యుమెంట్లతో క్యాంపస్‌కి రావాల్సి ఉంటుంది.