ఎట్టకేలకు రానున్న టెక్నో పాప్‌9.. తక్కువ బడ్జెట్లోనే స్టన్నింగ్‌ ఫీచర్స్‌

www.mannamweb.com


చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ టెక్నో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. టెక్నో పాప్‌ 9 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. నిజానికి గత కొన్ని రోజులుగా ఈ ఫోన్‌కు సంబంధించి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది..

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్ దిగ్గజం టెక్నో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. టెక్నో పాప్‌ 9 పేరుతో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నారు. నవంబర్‌ 22వ తేదీన ఈ ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మీడియాటెక్‌ హీలియో జీ50 ప్రాసెసర్‌తో వస్తున్న ఈ తొలి స్మార్ట్‌ఫోన్‌గా టెక్నో పాప్‌ 9 నిలవనుంది. ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ వేదికగా ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ధర విషయానికొస్తే ఈ ఫోన్‌ ప్రారంభ వేరియంట్‌ రూ. 10 వేల రేంజ్‌లో ఉండనుంది.

ఈ ఫోన్‌ను 6 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌తో తీసుకొస్తున్నారు. ఇక మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా ఇంటర్నల్ స్టోరేజీని 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఇందులో పంచ్‌ హోల్‌ డిజైన్‌ డిస్‌ప్లేను ఇ్వవనున్నారు.

ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందిస్తున్నారు. ఈ కెమెరా PDAF టెక్నాలజీకి సపోర్ట్‌ చేస్తుంది. 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌కు సపోర్ట్‌ చేసే స్క్రీన్‌ను ఇవ్వనున్నారు.

బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 15 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఈ ఫోన్‌ను గ్లిట్టరీ వైట్, లైమ్ గ్రీన్, స్టార్‌ట్రైల్ బ్లాక్ వంటి కలర్స్‌లో తీసుకొస్తున్నారు.