Teeth: పసుపు దంతాలతో బాధపడుతున్నారా.? ఇంట్లోనే ఇలా చేయండి..

అందాన్ని పెంచడంలో పళ్లు కీలక పాత్ర పోషిస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పళ్ల ఆకారంతో పాటు రంగు కూడా మన అందంపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా పసుపు పచ్చని పళ్ల కారణంగా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. పళ్లు పచ్చగా మారడానికి తీసుకునే ఆహారం మొదలు తాగే నీటి వరకు ఎన్నో కారణాలు ఉంటాయి. సాధారణంగా పళ్లు పచ్చగా మారితే వైద్యులను సంప్రదించి క్లీనింగ్ చేయించుకుంటారు.


అయితే ప్రతీసారి క్లీనింగ్ చేయించుకోవడం ఇబ్బందితో కూడుకున్న విషయం. అలా కాకుండా ఇంట్లో లభించే వస్తువులతోనే దంతాల రంగును తెలుపు రంగులోకి మార్చుకోవచ్చు. ఇంతకీ పసుపు రంగులో ఉన్న దంతాలను తెలుపు రంగులోకి మారాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

* దంతాలను నేచురల్‌గా పాలిష్‌ చేయడంలో అరటి తొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందుకోసం ముందుగా ఒక అరటి తొక్కను తీసుకోవాలి. తర్వాత అరటి బెరుడు భాగాన్ని తీసుకొని లోపలి తెల్లటి భాగం నుంచి మొదలు పెట్టి దంతాలపై నెమ్మదిగా రుద్దాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే కొన్ని రోజుల్లోనే మీ దంతాలు తెలుపు రంగులోకి మారుతాయి.

* పసుపు రంగులో ఉన్న దంతాలు తెలుపు రంగులోకి మార్చడంలో ఆవనూనె, ఉప్పు ఉయోగపడుతుంది. ఇందుకోసం కొంత ఆవనూనె తీసుకొని అందులో చిటికెడు ఉప్పు కలపాలి. అనంతరం ఈ మిశ్రంతో దంతాలపై రెండు నుంచి మూడు నిమిషాల పాటు మసాజ్‌ చేస్తే సరిపోతుంది. పసుపు రంగులో ఉన్న దంతాలు మళ్లీ తెలుపు రంగులోకి మారుతాయి.

* పసుపు రంగులో ఉన్న దంతాలు తిరిగి తెలుపు రంగులోకి మారడంలో బేకింగ్ సోడా ఎంతగానో పనిచేస్తుంది. ఇందుకోసం కొంత బేకింగ్ సోడా తీసుకొని అందులోని కొంచెం నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. అనంతరం బ్రష్‌పై అప్లై చేసి బ్రష్‌ చేసుకోవాలి. తర్వాత పళ్లను శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేస్తే త్వరగానే పళ్లు తెలుపు రంగులోకి మారుతాయి.

* స్ట్రాబెర్రీలు కూడా పసుపు పచ్చ పళ్లు తెలుపు రంగులోకి మారడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ముందుగా స్ట్రాబెర్రీలను తీసుకొని వాటిని మెత్తగా చేసుకోవాలి. అనంతరం ఆ పేస్ట్‌ను దంతాలపై అప్లై చేసిన కొద్ది సేపు అలాగే ఉంచాలి. అనంతరం కాసేపు దంతాలపై రుద్ది.. నాటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇది దంతాల రంగు తెలుపు రంగులోకి మారడంలో ఉపయోగపడుతుంది.