సీఎం రేవంత్‌రెడ్డి 55వ పుట్టినరోజు. ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు ఇదే తొలి పుట్టినరోజు. కానీ.. పర్సనల్ సెలబ్రేషన్ల సంగతేమో గాని.. బర్త్‌డే మొత్తం జనం మధ్యనే గడిపారు.
నల్గొండ జిల్లాలో సుడిగాలి పర్యటనతో బిజీగా గడిపారు సీఎం రేవంత్‌రెడ్డి. పుట్టిన రోజు సందర్భంగా యాదగిరి లక్ష్మీ నరసన్నను దర్శించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. స్వామివారి దర్శనం తర్వాత వైటీడీఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు. యాదాద్రి ఆలయ అభివృద్ధి, పనుల పురోగతిపై చర్చించారు. యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని నెక్ట్స్ లెవెల్‌కు తీసుకు వెళతా.. అని హింట్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.
ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. యాదాద్రి పేరు యాదగిరిగుట్టగా మార్చాలని, టీటీడీ తరహాలో ప్రత్యేక పాలక మండలి ఏర్పాటు చేయాలని, గోశాలలో గోసంరక్షణ కోసం ప్రత్యేక పాలసీ తీసుకురావాలని, విమాన గోపురానికి 60 కిలోల బంగారంతో తాపడం పనులు వేగవంతం చేయాలని.. నిర్ణయించారు. యాదగిరిగుట్ట సందర్శన తర్వాత.. మూసీ పునరుజ్జీవ పాదయాత్ర చేపట్టారు రేవంత్‌రెడ్డి. సంగెం దగ్గర మూసీ కాలువను పరిశీలించి.. భీమలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. బోటులో ప్రయాణిస్తూ మూసీ ప్రవాహాన్ని పరిశీలించారు. ధర్మారెడ్డికాలువ వెంట నేతలు, కార్యకర్తలు, రైతులతో కలిసి రెండున్నర కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. కాలువ వెంట పొలాల్లోని రైతులతో ముచ్చటించి, వారి సమస్యలు విన్నారు. అక్కడే రైతులను, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు సీఎం రేవంత్‌రెడ్డి.
ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఉత్తమ్‌కుమార్.. పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొన్నారు. మూసీ నది పునరుజ్జీవాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్‌రెడ్డి.. ఇటీవలే స్పెషల్ టీమ్‌ని సియోల్ పంపి.. అనేక అధ్యయనాలు చేయించారు. మరో మూడేళ్లలో మూసీ నదిని తెలంగాణ ఐకాన్లలో ఒకటిగా మారుస్తానని మాటిచ్చారు. అందులో భాగంగానే.. పుట్టినరోజున మూసీలో పడవ ప్రయాణం చేసి.. తన కమిట్‌మెంట్‌ను చాటుకున్నారు సీఎం రేవంత్‌రెడ్డి.