తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 25,000 ఉద్యోగాలు..

వరంగల్‌లో త్వరలోనే విమానాశ్రయం ప్రారంభం కానుంది. దీని వల్ల రవాణా సౌకర్యాలు మెరుగవుతాయి. ఈ కారణంగా టెక్స్టైల్ పార్కులో పెట్టుబడి పెట్టాలనుకుంటున్న కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. పైగా ఈ పార్కును కేంద్రం “పీఎం మిత్ర” పథకంలో చేర్చే అవకాశమూ ఉంది. దీనివల్ల మరిన్ని కంపెనీలు రావొచ్చు.


వరంగల్ జిల్లాలో ఉన్న కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో పని చేస్తున్న కిటెక్స్ కంపెనీ 25,000 ఉద్యోగాల కోసం ప్రకటన విడుదల చేసింది. మంగళవారం (ఏప్రిల్ 9) నుంచి ఇంటర్వ్యూలు కూడా ప్రారంభం కానున్నాయి. ఇందులో వైస్ ప్రెసిడెంట్‌లు, మేనేజర్‌లు, ఇంజినీర్‌లు, సూపర్వైజర్‌లు లాంటి పోస్టులు ఉన్నాయి. అర్హత ఉన్నవారు కంపెనీ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ కంపెనీ ట్రయల్ రన్ దశలో ఉంది. దరఖాస్తు అనంతరం ఇంటర్వ్యూలు ఉంటాయని పేర్కొంటున్నారు.

వరంగల్‌ ప్రాంతానికి పెరుగుతున్న ఆసక్తి
వరంగల్‌లో త్వరలోనే విమానాశ్రయం ప్రారంభం కానుంది. దీని వల్ల రవాణా సౌకర్యాలు మెరుగవుతాయి. ఈ కారణంగా టెక్స్టైల్ పార్కులో పెట్టుబడి పెట్టాలనుకుంటున్న కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. పైగా ఈ పార్కును కేంద్రం “పీఎం మిత్ర” పథకంలో చేర్చే అవకాశమూ ఉంది. దీనివల్ల మరిన్ని కంపెనీలు రావొచ్చు.

2017లో ఈ పార్క్‌ను ప్రారంభించినప్పుడు 22 కంపెనీలు రూ.3,900 కోట్ల పెట్టుబడి పెట్టాలని ఒప్పందం చేసుకున్నాయి. కానీ ఇప్పటివరకు కేవలం మూడు కంపెనీలు మాత్రమే ఉత్పత్తిని ప్రారంభించాయి. వాటిలో ముఖ్యమైనది కిటెక్స్, ఇది రూ.1,200 కోట్లతో పిల్లల దుస్తుల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. ఇంకా గణేశా ఎకో పెట్, ఎకోటెక్ అనే రెండు కంపెనీలు చిన్న యూనిట్‌లను నెలకొల్పాయి. కొరియా కంపెనీ యంగాన్ కూడా 8 ఫ్యాక్టరీలు పెట్టాలని చెప్పినప్పటికీ ఇంకా మొదలు పెట్టలేదు.

తెలంగాణ సర్కార్ ఫోకస్..
కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పార్క్‌ను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పని చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి పార్క్‌ను సందర్శించి సమస్యలు తెలుసుకున్నారు. దక్షిణ కొరియాలో పెట్టుబడిదారులతో సమావేశం ఏర్పాటు చేశారు. దీని వల్ల కొంతమంది విదేశీ కంపెనీలు టెక్స్టైల్ పార్క్‌ను సందర్శించాయి. రవాణా సౌకర్యాలు అంతగా లేవని వారు చెప్పారు. కానీ త్వరలో విమానాశ్రయం వస్తుండటంతో సమస్య తీరుతుందని అధికారులు చెబుతున్నారు.

ఇంకా మరిన్ని కంపెనీలు..
ఇప్పటికే మరో రెండు కంపెనీలు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమయ్యాయి. అలాగే ఈ నెల 18 నుంచి జపాన్‌లో జరిగే బిజినెస్ సమావేశంలో కూడా తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడుల కోసం ప్రమోషన్ చేయనుంది. రవాణా సౌకర్యాలు మెరుగైతే, ఈ టెక్స్టైల్ పార్క్‌లో మరిన్ని కంపెనీలు రావచ్చని అంచనా.