వరుణ్ తేజ్ మట్కా మూవీ థియేటర్లలో రిలీజైన ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతుంది. డిసెంబర్ 5 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. మట్కా మూవీలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటించారు.
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన మట్కా మూవీ ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి వస్తోంది. పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో భారీ అంచనాల నడుమ తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు కరుణ కుమార్ దర్శకత్వం వహించాడు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా కనిపించారు.
అమెజాన్ ప్రైమ్‌లో…
నవంబర్ 14న మట్కా మూవీ థియేటర్లలో రిలీజైంది. ఇరవై రోజుల్లోనే ఈ తెలుగు మూవీ ఓటీటీలోకి వస్తోంది. మట్కా మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సొంతం చేసుకున్నది.
డిసెంబర్ 5న మట్కా ఓటీటీలో రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ ను అమెజాన్ ప్రైమ్ శనివారం అఫీషియల్ గా వెల్లడించింది. తెలుగుతో పాటు మిగిలిన దక్షిణాది భాషల్లో ఈ పీరియాడికల్ మూవీ స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో రిలీజైన నాలుగు నుంచి ఆరు వారాల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాలని తొలుత మేకర్స్ భావించినట్లు సమాచారం. రిజల్ట్ కారణంగానే అనుకున్న దానికంటే ముందుగానే ఈ మూవీ ఓటీటీలోకి వస్తోన్నట్లు సమాచారం.
మట్కా కింగ్ జీవితంతో…
మట్కా కింగ్‌గా పేరొందిన రతన్ ఖేత్రి జీవితం నుంచి స్ఫూర్తి పొందుతూ మూడు టైమ్ పీరియడ్స్ నేపథ్యంలో దర్శకుడు కరుణకుమార్ మట్కా మూవీని తెరకెక్కించాడు. వరుణ్ తేజ్ నటనకు ప్రశంసలు కరుణకుమార్ టేకింగ్‌లో కొత్తదనం లేకపోవడంతో ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
సాధారణ యువకుడు మట్కా కింగ్‌గా ఎలా ఎదిగాడన్నది దర్శకుడు ఇంట్రెస్టింగ్‌గా స్క్రీన్‌పై ప్రజెంట్ చేయలేకపోయాడనే విమర్శలొచ్చాయి.
మట్కా కథ ఇదే…
బర్మా నుంచి వైజాగ్‌కు వలసవచ్చిన వాసు (వరుణ్ తేజ్ ) హత్య కేసులో చిక్కుకొని జైలుపాలవుతాడు. జైలు వార్డెన్ నారాయణమూర్తి భయం అన్నది లేకుండా వాసు పెంచుతాడు. జైలు నుంచి విడుదలైన వాసు పూర్ణ మార్కెట్‌లో కొబ్బరికాయల వ్యాపారి అప్పలరెడ్డి (అజయ్ ఘోష్) దగ్గర పనిలో చేరుతాడు.
మార్కెట్‌లో జరిగిన గొడవలో రెడ్డి గ్యాంగ్‌ను ఎదురిస్తాడు వాసు. రెడ్డి గ్యాంగ్‌కు ప్రత్యర్థి అయినా నానిబాబు (కిషోర్) కు చేరువ అవుతాడు. ఆ రౌడీ గ్యాంగ్‌తో మొదలైన వాసు జర్నీ మట్కా కింగ్ వరకు ఎలా సాగింది? వాసును చంపాలని ప్రభుత్వం ఎందుకు అనుకుంది. వాసుకు సాహుకు (నవీన్ చంద్ర) ఉన్న సంబంధం ఏమిటి? వాసు జీవితంలోకి వచ్చిన మీనాక్షి (మీనాక్షి చౌదరి) సోఫియా (నోరా ఫతేహి) ఎవరన్నదే మట్కా మూవీ కథ.
వాట్ నెక్స్ట్…
మట్కా మూవీకి జీవీ ప్రకాష్‌కుమార్ మ్యూజిక్ అందించాడు. మట్కా కంటే ముందు వరుణ్‌తేజ్ చేసిన గని, ఆపరేషన్ వాలెంటైన్, గాండీవధారి అర్జున డిజాస్టర్స్‌గా నిలిచాయి. మట్కా డిజాస్టర్ నేపథ్యంలో వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీ ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.