Temple Rules: గుడిలో ఎవరైనా ఈ 5 వస్తువులు ఇస్తే అస్సలు తీసుకోవద్దు, ఎందుకంటే?

దేవాలయాలు శక్తి కేంద్రాలుగా చెప్పుకుంటారు. అవి స్వచ్ఛమైనవి, పవిత్రమైనవి మాత్రమే కాదు… ఎంతో శక్తివంతమైనవి కూడా. విశ్వాన్ని రక్షించే దేవతల నివాసాలే ఆలయాలు.


కాబట్టి దేవాలయాలకు వెళ్లేవారు అక్కడ ఎవరు ఏమిచ్చినా తీసుకుంటారు. నిజానికి అలా తీసుకోకూడదు. కొన్ని వస్తువులు పూజారి ఇస్తేనే దేవాలయంలో తీసుకోవాలి. మిగతా వారు ఇస్తే స్వీకరించకూడదు.

కొందరు వ్యక్తులు భక్తుల మనోభావాలతో ఆడుకునే వారు ఉంటారు. వారు దేవాలయాలను అపవిత్రం చేస్తారు. చెడు ఉద్దేశంతో కొన్ని రకాల వస్తువులను ఇస్తూ ఉంటారు. అలా ఇవ్వడం దురదృష్టం అని తెలిసినా కూడా కావాలనే అలా చేస్తారు. మీరు దేవాలయాలకు వెళ్ళినప్పుడు అపరిచితుల నుండి అంగీకరించకూడని ఐదు వస్తువులు ఇక్కడ ఉన్నాయి. వీటిని పూజారి ఇస్తే స్వీకరించవచ్చు… కానీ ఇతరులు ఇస్తే స్వీకరించకూడదు.

విభూతి
విభూతిని ఆలయంలో ఎవరు పడితే వారి నుంచి స్వీకరించకండి. కేవలం పూజారి మాత్రమే దాన్ని మీకు ఇవ్వాలి. ఎందుకంటే విభూతి ఎంతో స్వచ్ఛమైనది, పవిత్రమైనది, శక్తివంతమైనది. మనదేశంలోని దేవాలయాల్లో పూజారే విభూతిని ఇస్తారు. కానీ తెలియని వ్యక్తుల నుంచి దాన్ని తీసుకుంటే ఆ బూడిద ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. వారు చెడు ఉద్దేశంతో మీకు విభూతిని అందిస్తే మీపై ప్రతికూల శక్తి కూడా పడవచ్చు. కాబట్టి విభూతిని ఎప్పుడూ ఇతరుల నుంచి స్వీకరించకండి.

బొమ్మలు
ఆలయ ప్రాంగణంలో కొన్ని రకాల బొమ్మలు చెట్లు వద్ద పెట్టేసి ఉంటాయి. కొందరు నైవేద్యంగా దేవాలయాల్లో బొమ్మలను కూడా దేవునికి పెడుతూ ఉంటారు. కానీ కొన్ని బొమ్మలు వ్యక్తులకు హాని కలిగిస్తాయి. బొమ్మల పై ముఖాలు పెద్దవిగా ఉంటే ఆ బొమ్మలను స్వీకరించకూడదు. కొన్ని సంస్కృతులలో బొమ్మలను ఉపయోగించి వ్యక్తులను బాధపెట్టే పద్ధతులు ఉన్నాయి. అవి అవతల వ్యక్తికి హాని కలిగిస్తాయి. కాబట్టి తెలియని వ్యక్తుల నుండి ఆలయాల్లో బొమ్మలను స్వీకరించకండి.

కుంకుమ
ఆలయంలో కచ్చితంగా ఉండేది కుంకుమ. మీరు ఆ కుంకుమను తీసి పెట్టుకోవచ్చు లేదా పూజారి మీకు పెట్టవచ్చు. కానీ ఆలయంలో ఎవరు పడితే వారు కుంకుమను ఇస్తే తీసుకోకూడదని చెబుతారు. వారు చెడు ఉద్దేశంతో ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి నోములు, వ్రతాల సమయంలో ఇతరులు ఇచ్చే కుంకుమను స్వీకరించవచ్చు. కానీ ఆలయాల్లో సాధారణంగా కుంకుమను పంపిణీ చేస్తున్నప్పుడు తీసుకోకపోవడం మంచిది.

పువ్వులు
భారతీయ ఆచారంలో పూజలలో పువ్వులు, పూలదండలు ఎంతో ముఖ్యమైనవి. దేవతలకు పూజ చేసేందుకు పువ్వులను వినియోగిస్తారు. దేవతలను అలంకరించేందుకు పూలదండలను వినియోగిస్తారు. దేవాలయాల్లో పూజారులు పువ్వులను తీసుకోవచ్చు. కానీ అపరిచిత వ్యక్తుల నుండి మాత్రం ఎలాంటి పువ్వులను, పూలదండలను స్వీకరించకండి. ఆ పూలల్లో తెగుళ్లు వంటివి ఉంటే అవి ప్రతికూలతను, ప్రతికూల శక్తిని మీపై ప్రసరించే అవకాశం ఉంది.

కొబ్బరి ముక్కలు
దేవాలయాల్లో కొబ్బరికాయలను కొట్టే వారి సంఖ్య ఎక్కువే. ఆ కొబ్బరికాయలను దేవుళ్లకు నైవేద్యంగా ఉంచి పూజారి తిరిగి భక్తులకు అందిస్తారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆ కొబ్బరి ముక్కలను దేవాలయాల్లో ఇస్తే తీసుకోండి… కానీ అపరిచిత వ్యక్తుల నుంచి మాత్రం కొబ్బరి ముక్కలను స్వీకరించకండి. ముఖ్యంగా కొబ్బరికాయకు కొబ్బరి ముక్కలకు కుంకుమ పూసినట్లు చూసినా లేదా విభూతి పూసినట్లు చూసిన దాన్ని ముట్టుకోకపోవడమే మంచిది. అలాగే కిందపడిన కొబ్బరి ముక్కలను కూడా ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు.