తెలంగాణలో పాఠ్య పుస్తకాలు వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్: తెలంగాణలో పాఠ్య పుస్తకాలు వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. బుధవారం పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు అధికారులు పాఠ్య పుస్తకాలు, వర్క్‌బుక్‌లు పంపిణీ చేశారు. విద్యాశాఖ వీటిలో ముందుమాట మార్చకుండా ముద్రించింది. ఇది వివాదాస్పదం కావడంతో వాటిని వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.