తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. 7404 జీపీవో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న గ్రామ పాలన అధికారుల (GPO) పోస్టుల భర్తీ చేసేందుకు మరో ముందడుగు వేసింది.


ఇప్పటికే 10,954 పోస్టుల భర్తీ కోసం అనుమతి ఇచ్చిన రెవెన్యూ శాఖ.. రెండో విడత నోటిఫికేషన్‌ను బుధవారం (జూలై 10) విడుదల చేసింది. ఇందులో భాగంగా 7404 పోస్టులను భర్తీ చేయనున్నారు.

గతంలో విడుదలైన మొదటి విడత నోటిఫికేషన్‌కు మంచి స్పందన వచ్చింది. అయితే ఈ ఆస్తులకు పూర్వ వీఆర్ఏలు (Village Revenue Assistants), వీఆర్వోలు (Village Revenue Officers) మాత్రమే దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పించారు. దాంతో సుమారు 5,000 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 3,550 ఇప్పటికే ఎంపిక చేశారు. ఇప్పుడు భాగాంగా 7040 పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రభుత్వం మరోసారి పూర్వ వీఆర్ఎలు, వీఆర్వోలకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది.

అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను జూలై 16వ తేదీలోపు ఆన్లైన్ ద్వారా సమర్పించాల్సి కోరింది. ఎంపికలో భాగంగా అభ్యర్థులు తమ సర్వీసు సర్టిఫికెట్లు, గుర్తింపు పత్రాలు, శిక్షణ ధృవీకరణ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. రెవెన్యూ శాఖ నిర్ణయం ప్రకారం జూలై 27న అర్హత పరీక్షను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈ పరీక్ష ఒకే రోజు, ఒకే సమయానికి జరుగనుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.