దేశవ్యాప్తంగా హిందులవులు జరుపుకున్న పండుగల్లో వినాయక చవితి కూడా ఒకటి. ఈ పండుగను అందరూ ఎంతో విశిష్టంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఈ వినాయక చవితి వచ్చిదంటే చాలు.. చిన్న నుంచి పెద్ద వరకు చేసిన హడవిడి మాములుగా ఉండదు. అంతేకాకుండా.. గ్రామాల నుంచి పట్టణ నగారాల వరకు గణపతి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఇకపోతే ఈ వినాయక చవితిని ప్రాంతం బట్టి గణేష్ చతుర్థి, గణేష్ ఉత్సవ్ అని కూడా పిలుస్తారు. ఇదిలా ఉంటే.. గణేశ్ ఉత్సవాలంటే మొదట మహారాష్ట ముంబై గుర్తుకు వస్తుంది. ఎందుకంటే.. ఆ రాష్ట్రంలోని గణపతి నవరాత్రలుకు పుట్టినిల్లుగా ఉంటుంది. అంగరంగ వైభవంగా గణపతి నవరాత్రులు ఆ రాష్ట్రంలో జరుగుతాయి. ముంబైలోని జీఎస్బీ సేవా మండలి ప్రతిష్టించే గణపతి విగ్రహం ఆ నగరానికి చాలా ప్రత్యేకం. ఈసారి కూడా ఈ గణపతి చాలా స్పెషల్ గా నిలవబోతున్నాడు. మరీ, ఆ విషయాలేంటో తెలుసుకుందాం.
ప్రతి ఏటా గణపతి నవరాాత్రలను ముంబైలోని చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఇక అక్కడ ప్రతి గణపతి విగ్రహం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ముంబైలోని జీఎస్బీ సేవా మండలి ప్రతిష్టించే గణపతి విగ్రహం ఆ నగరానికి ఎంతో ప్రత్యేకతంగా నిలుస్తుంటుంది. ఎందుకంటే.. ఈ మండలి వడాలాలోని కింగ్స్ సర్కిల్ సమీపంలో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది. పైగా ఈ విగ్రహానికి ప్రతిఏటా బంగారు నగలు ధరింజేస్తారనే విషయం తెలిసిందే. ఇక ఎప్పటిలానే ఈ ఏడాది కూడా ఈ మహా గణపతికి 69 కిలోల బంగారు నగలను ధరింపజేయనున్నారు. అలాగేరూ. 400 కోట్ల బీమా కూడా చేయించనున్నారు. అయితే దేశంలో ఇంత ఘనంగా అన్ని కిలోల బంగారం, బీమాతో పూజలు అందుకున్న గణపతిల్లో ముంబైయి గణపతి ప్రసిద్ది. ఇకపోతే మహారాష్ట్ర సంప్రదాయలకు అనుగుణంగా ఇక్కడ నిత్యం పూజలు, అర్చనలు నిర్వహించనున్నారు.
ఇదిలా ఉంటే.. వినాయకుని పుట్టిన రోజుగా పురస్కరించుకుంటున్న ఈ పండుగ కేవలం మన దేశంలోనే కాదు.. ప్రపంచ దేశాల్లోకూడా ప్రతి ఏటా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాలు సెప్టెంబర్ 7వ తేదీ (శనివారం) నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు జరగనుంది. ఇక సెప్టెంబర్ 17వ తేదీన ఆ మహా గణపతికి ఘనంగా నిమజ్జనం జరగనుంది. అయితే హిందు పంచాంగం ప్రకారం.. మహా గణపతిని ఆహ్వానించడానికి శుభప్రదమైన సమయం సెప్టెంబర్ 6 మధ్యాహ్నం 3.01 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 7న సాయంత్రం 5.37 గంటలకు ముగియనుంది. ఇక పూజ చేసేందుకు శుభ ముహూర్తం సెప్టెంబర్ 7న ఉదయం 11.03 నుంచి 1.34 మధ్యలో ఉంది.