మీరు బడ్జెట్ లో డీజిల్ కార్ కోసం వెతుకుతున్నారా?5 స్టార్ గ్లోబల్ NCAP సేఫ్టీ రేటింగ్ తో ఇండియాలో అత్యంత తక్కువ ధరలో లభించే డీజిల్ కార్ మార్కెట్లో అందుబాటులో ఉంది.ఎక్కువ మైలేజ్, 360 డిగ్రీ కెమెరా, సన్‌రూఫ్, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ వంటి ఆధునిక ఫీచర్లతో తక్కువ బడ్జెట్‌లో కారు కొనాలి అనుకునేవారికి ఇది సరైన ఎంపికగా చెప్పుకోవచ్చు.డీజిల్ కార్లు పెట్రోల్ కార్లతో పోలిస్తే మెరుగైన మైలేజ్ అందిస్తాయి. రోజు ఎక్కువ దూరం ప్రయాణం చేసే వారికి ఇది డీజిల్ కార్లు బెస్టుగా ఉంటాయి .తక్కువ బడ్జెట్లో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్ ధర,మైలేజ్,ఫీచర్స్,మోడల్ వివరాలు చూద్దాం.
భారతీయ మార్కెట్లో అత్యంత తక్కువ ధరలో లభించే డీజిల్ కార్ టాటా ఆల్ట్రోస్.డైలీ ప్రయాణించే వారికీ పర్ఫెక్ట్ గా సరిపోయే కార్.టాటా ఆల్ట్రోస్ స్టైల్‌తో పాటు, మంచి పెర్ఫార్మన్స్ కలిగిన కార్.పర్యావరణం పరిరక్షించే వాహనాలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తూ డీజిల్ కార్లపై కఠిన ఉద్గార నిబంధనలు పెడుతుంది. ఢిల్లీ లాంటి నగరాల్లో డీజిల్ వాహనాలకు 10 సంవత్సరాల వాలిడిటీ మాత్రమే ఉంది.పెట్రోల్ వాహనాలతో పోలిస్తే డీజిల్ కార్లు ఎక్కువ మైలేజ్‌ను అందిస్తాయి. డైలీ ఎక్కువగా ప్రయాణించే వారు ఇంకా డీజిల్ వాహనాలనే వాడడానికి ఇష్టపడుతున్నారు.టాటా ఆల్ట్రోస్ డీజిల్ కార్ వివరాలు చూద్దాం.
టాటా ఆల్ట్రోజ్ ఇంజన్
1.5L,4 సిలిండర్ టర్బో ఛార్జ్డ్ రేవోటార్క్ డీజిల్ BS6.2 ఇంజన్ ఉంటుంది.
88.7bhp పవర్,200nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.
దీనిలో 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది.
12.52 సెకండ్స్ లో 0-100km/h వేగాన్ని అందుకుంటుంది.
ఫీచర్స్
26.03 cm HD ఇన్ఫోటైన్మెంట్ సిస్టం
7 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్
అల్ట్రా వ్యూ ట్విన్ డిజిటల్ కాక్ పిట్
వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో & కార్ ప్లే ఉంటుంది
క్రూజ్ కంట్రోల్
4 స్పీకర్స్ & 4 ట్వీటర్లు
ఆడియో wrox ఉంటుంది.
మ్యాప్ వ్యూ
బ్లైండ్ స్పాట్ మానిటర్
వైర్ లెస్ చార్జర్
X ప్రెస్ కూల్
వాయిస్ అసిస్ట్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఉంటుంది.
ముందు డిస్క్ బ్రేక్స్ ,వెనుక డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి.
360 డిగ్రీ వ్యూ కెమెరా
6 ఎయిర్ బ్యాగ్స్
ESP సిస్టం
LED ఫాగ్ లాంప్స్ ఉంటాయి.
రియర్ AC వెంట్స్
5 సీట్ కెపాసిటీ ఉంటుంది.
బూట్ స్పేస్ 345L
గ్రౌండ్ క్లియరెన్స్ 165mm
ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 37L
16 ఇంచ్ అలోయ్ వీల్స్ ఉంటాయి.
టాటా ఆల్ట్రోజ్ 23.64kmpl మైలేజ్ ఇస్తుంది. మైలేజ్ ఎక్స్ షో రూమ్ ప్రారంభ ధర 8.99 లక్షలు.
టాటా ఆల్ట్రోస్ డీజిల్ వేరియంట్ భారతీయ మార్కెట్‌లో బడ్జెట్‌లో మైలేజ్‌కు ప్రాధాన్యత ఇచ్చే వినియోగదారులకు బెస్ట్ ఛాయస్ గా నిలుస్తోంది. అధునాతన ఫీచర్లు, భద్రతా ప్రమాణాలు,అనుకూలమైన ధరతో ఇది డీజిల్ కార్లను కోరుకునే వారికి ధరకు తగ్గ వాల్యూ అందిస్తోంది. ప్రభుత్వ నిబంధనలు పెడుతున్న ఎక్కువగా ప్రయాణం చేసే వారికి డీజిల్ వాహనాలు ఇంకా ఉపయోగపడుతూనే ఉన్నాయి.ప్రజెంట్ టాటా ఆల్ట్రోస్ లాంటి కార్లు వినియోగదారుల ఖర్చు తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి.
Post Views: 95
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.