కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తాజాగా 8వ పే కమిషన్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఎనిమిదో పై కమిషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణల కోసం ఉద్దేశించడం అయినది.
త్వరలోనే ఎనిమిదో పే కమిషన్ చైర్మన్ అలాగే ఇతర సభ్యుల నియామకం జరగడంతో పాటు వేతన సవరణ పైన అధ్యయనం కూడా ప్రారంభం కానుంది. అయితే ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద ఎత్తున వేతనం పెరుగుతుందనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు మోడీ ప్రభుత్వం త్వరలోనే ప్రైవేటు ఉద్యోగులకు కూడా న్యాయం చేసేందుకు అనేక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పేర్కొంటున్నారు ముఖ్యంగా ఇందులో భాగంగా ఈపీఎస్ 95 పెన్షన్ దారులకు కనీస పెన్షన్ పెంచే అవకాశం ఉందని వార్తలు కూడా ఉద్యోగ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ప్రధానంగా ఈపీఎస్ 95 పెన్షన్ కింద ప్రస్తుతం మినిమం పెన్షన్ కేవలం 1000 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. అయితే ఈ మొత్తాన్ని త్వరలోనే 7500 రూపాయలకు పెంచేందుకు కేంద్రకం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే మినిమం ఎడిషన్ 7500 చేయాలని సుదీర్ఘకాలంగా ఈపీఎస్ 95 పెన్షన్ దారులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పెన్షన్ దారులు కేంద్ర మంత్రులకు తమ విజ్ఞప్తిని కూడా తెలియజేశారు. అలాగే పలు నిరసన ప్రదర్శనలు కూడా చేపట్టారు. ప్రస్తుత కాలంలో పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో ఉంచుకొని మినిమం పెన్షన్ కనీసం 7500 అయితేనే మంచిదని పెన్షన్ దారులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మోడీ ప్రభుత్వం దీనిపైన ఇప్పటికే పార్లమెంటరీ కమిటీ కూడా ఏర్పాటు చేయగా ఎంపీ బసవరాజు బొమ్మై ఆధ్వర్యంలో పార్లమెంటరీ కమిటీ పలు సిఫార్సులు చేసింది. అందులో ప్రధానంగా మినిమం పెన్షన్ పెంచాలని సూచన చేసింది. గతంలో మినిమం పెన్షన్ 3000 రూపాయలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించినట్లు వార్తలు వచ్చినప్పటికీ, అయితే అధికారికంగా ఎలాంటి ధ్రువీకరణ లేకపోవడంతో మూడు వేల రూపాయల పెన్షన్ అనే వివాదంపై తెర పడింది అని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే 7500 పెన్షన్ విషయంలో పెద్ద ఎత్తున పెన్షన్ దారుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. అయితే ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఈపీఎస్ 95 పెన్షన్ దారుల విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. గమనిక: పైన పేర్కొన్న సమాచారం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న వార్త కథనాల ఆధారంగా రూపొందించడం జరిగింది. ఈపీఎస్ 95 పెన్షన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. ఈ సమాచారం కోసం కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ లను ప్రామాణికంగా తీసుకోవాలి.































