డిసెంబర్ 31 వరకే ఛాన్స్.. ఈ 5 పనులు పూర్తి చేయకుంటే భారీ పెనాల్టీలు.. చెక్ చేసుకోండి

2025 ముగించుకొని కొత్త ఏడాదికి స్వాగతం చెప్పేందుకు దేశ ప్రజలు సిద్ధమవుతున్నారు. 2025 క్యాలెండర్ ముగిసేందుకు రెండు వారాలు మాత్రమే ఉంది.


డిసెంబర్ 31 ఒక సంవత్సరం ముగింపు మాత్రమే కాదు, కొన్ని ముఖ్యమైన ఆర్థిక పరమైన పనులు ముగించేందుకు కీలకం. అందులో పన్ను చెల్లింపుదారులకు, సాధారణ పౌరులకు ముఖ్యమైన గడువులకు డెడ్‌లైన్. ఈ లోగా పూర్తి చేయాల్సిన పనుల లిస్ట్, వాటి ప్రాముఖ్యత తెలుసుకోవడం తప్పనిసరి.

1. ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్

కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) ట్యాక్స్ ఆడిట్ కేసులకు సంబంధించి టాక్స్ రిటర్న్ దాఖలు చేసే గడువు డిసెంబర్ 10, 2025 వరకు పొడిగించారు. అదనపు ఆర్థిక వివరాలు సమర్పించే వారికి ఈ నిర్ణయం ఊరట అందించింది. ఒకవేళ మీరు ఇంకా రిటర్న్స్ ఫైల్ చేయకపోతే, భారీ జరిమానాతో ‘ బిలేటెడ్ ఐటీఆర్ ‘ దాఖలు చేసేందుకు డిసెంబర్ 31 వరకు సమయం ఉంటుంది.2. పాన్-ఆధార్ లింకింగ్ (PAN-Aadhaar Linking)

అక్టోబర్ 1, 2024లోపు ఆధార్ తీసుకుని ఉండి ఇంకా పాన్‌తో లింక్ చేయని వారు డిసెంబర్ 31లోపు ఈ పని పూర్తి చేయవచ్చు. ఒక వేళ లింక్ చేయకుంటే జనవరి 1, 2026 నుంచి మీ పాన్ కార్డు పని చేయదని చెప్పవచ్చు. దీంతో బ్యాంకింగ్ లావాదేవీలు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, పన్ను రీఫండ్‌లు నిలిచిపోయే అవకాశం ఉంది.3. బిలేటెడ్, రివైజ్డ్ ఐటీఆర్ (Belated & Revised ITR)

ఆర్థిక సంవత్సరం 2024-25 (AY 2025-26)కి సంబంధించి ఇప్పటి వరకు ఐటీఆర్ ఫైల్ చేయని వారికి చివరి అవకాశం ఉంటుంది. డిసెంబర్ 31లోపు బిలేటెడ్ రిటర్న్ దాఖలు చేయొచ్చు. ఇందుకు రూ. 5 వేల వరకు ఆలస్య రుసుము (రూ. 5 లక్షల ఆదాయం లోపు ఉన్నవారికి రూ. 1000) చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఫైల్ చేసిన రిటర్న్స్‌లో పొరపాట్లు ఉంటే సరిదిద్దుకోవడానికి రివైజ్డ్ రిటర్న్ కూడా ఫైల్ చేయవచ్చు. జనవరి 1 తర్వాత మీరు ‘ITR-U’ మాత్రమే ఫైల్ చేసేందుకు అవకాశం ఉంటుంది. దీనిపై పన్ను మొత్తంలో 25 శాతం నుంచి 50 శాతం వరకు అదనంగా పెనాల్టీ పడుతుంది.4. అడ్వాన్స్ టాక్స్ మూడవ విడత

ఆర్థిక సంవత్సరం 2025-26కి సంబంధించిన అడ్వాన్స్ టాక్స్ మూడో విడత (75 శాతం వరకు) చెల్లించేందుకు డిసెంబర్ 15 వరకు గడువు ముగిసింది. అయినప్పటికీ పెనాల్టీ వడ్డీ నుంచి తప్పించుకోవడానికి వీలైనంత త్వరగా చెల్లించవచ్చు.5. జీఎస్టీ, బ్యాంక్ లాకర్ రూల్స్

వ్యాపారస్తులు, కంపెనీలు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక జీఎస్టీ రిటర్న్స్‌ను పైల్ చేయాల్సిన గడువు సైతం డిసెంబర్ 31 వరకే ఉంటుంది. టర్నోవర్ పరిమితి బట్టి ఈ రిటర్న్స్ చేయాల్సి ఉంటుంది. ఆలస్యమైతే ప్రతి రోజూ జరిమానా పడుతుంది. రిజర్వ్ బ్యాంక్ రూల్స్ ప్రకారం, బ్యాంకు లాకర్ తీసుకున్న వారికి కొత్త ఒప్పందాలపై సంతకాలు చేసి సమర్పించేందుకు ఈ నెలాఖరు వరకు సమయం ఉంటుంది.

అలాగే మీ బ్యాంక్ అకౌంట్లు, ఇన్సూరెన్స్ పాలసీలు నామినీల పేర్లు అప్‌డేట్ చేయడం మర్చిపోవద్దు. చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు, ఇతర సాంకేతిక ఇబ్బందులు రాకుండా ఉండాలంటే, ఈ పనులన్నింటినీ ఇప్పుడే పూర్తి చేసుకోవడం అన్ని విధాలా మంచిది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.