మ్యూచువల్‌ ఫండ్‌లలో తేడాలివే.. పెట్టుబడి నిర్ణయం మీదే.

www.mannamweb.com


దీర్ఘకాలంలో రాబడిని అందించే మ్యూచువల్ ఫండ్స్ కు ప్రజల ఆదరణ పెరుగుతోంది. కొంచెం రిస్క్ ఉన్నప్పటికీ వచ్చే ఆదాయం బాగా ఉండడంతో అనేక మంది వీటిలో పెట్టుబడి పెట్టడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు.

గతంలో పట్టణ ప్రజలు వీటిలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేవారు. బ్యాంకులు, పోస్టాఫీసుల్లోని ఫిక్సడ్ డిపాజిట్ పథకాలకు గ్రామాల ప్రజలు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. ప్రస్తుతం గ్రామీణులకు కూడా మ్యూచువల్ ఫండ్స్ పై అవగాహన పెరిగింది. అయితే వీటిలో పెట్టుబడి పెట్టేముందు వాటిపై పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా ఈక్విటీ, డెట్ మ్యూచువల్ ఫండ్స్ మధ్య అనేక తేడాలు ఉంటాయి. పెట్టుబడి పెట్టేముందు వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఈ రెండు పెట్టుబడి ఎంపికలూ విభిన్న ఆర్థిక లక్ష్యాలు, రిస్క్, రాబడిని కలిగి ఉంటాయి. మీరు దీర్ఘకాలంలో రాబడిని సంపాదించాలనుకున్నా, సురక్షితమైన స్వల్పకాలిక రాబడిని కోరుకుంటున్నా ఈ ఫండ్స్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం.

డెట్ మ్యూచువల్ ఫండ్

బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, కార్పొరేట్ డెట్, మనీ మార్కెట్ సాధనాలు తదితర స్థిరమైన ఆదాయాన్నిచ్చే సెక్యూరిటీలో ఈ ఫండ్ పెట్టుబడులు పెడుతుంది. ఇన్వెస్టర్లను క్రమమైన ఆదాయంతో వారి మూలధనానికి సంరక్షణను అందిస్తుంది. వీటితో రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది.

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్

ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌ అంటే పెట్టుబడి ప్రవాహం వంటింది. ప్రధానంగా స్టాక్‌లలో పెట్టుబడి పెట్టడానికి బహుళ పెట్టుబడిదారుల నుండి డబ్బును పూల్ చేస్తుంది. సాధారణంగా లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, సెక్టార్-స్పెసిఫిక్, ఇండెక్స్ ఫండ్స్ వంటి అందుబాటులో ఉన్న ఈక్విటీలకు కనీసం 65 శాతం ఆస్తులను కేటాయిస్తాయి.

పెట్టుబడి

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లు కంపెనీల స్టాక్స్, ఈక్విటీలలో పెట్టుబడి పెడతాయి. స్టాక్ మార్కెట్‌లో వాటాలను కొనడం ద్వారా దీర్ఘకాలిక రాబడిని లక్ష్యంగా చేసుకుంటాయి.
బాండ్లు, ట్రెజరీ బిల్లులు, ప్రభుత్వ సెక్యూరిటీలు, కార్పొరేట్ రుణాలు వంటి వారిలో డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడి పెడతాయి. వీటి నుంచి రాబడి సాధారణంగా ఉంటుంది. మూలధన సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తాయి.

రిస్క్‌

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ తో రిస్క్‌ అధికంగానే ఉంటుంది. మార్కెట్ పరిస్థితుల ఆధారంగా స్టాక్స్ విలువ మారుతూ ఉంటుంది. రిస్క్ చేయగలిగి, దీర్ఘకాలిక పెట్టుబడి లక్ష్యాలు ఉన్న వారికి అనుకూలంగా ఉంటాయి.
డెట్ మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే వీటికి రిస్క్‌ తక్కువ. ప్రాథమిక నష్టాలు, వడ్డీ రేటు, క్రెడిట్ రిస్క్ తదితర విషయాలు ఈక్విటీ ఫండ్స్ కంటే స్థిరంగా ఉంటాయి.

రాబడి

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌ల నుంచి దీర్ఘకాలంలో అధిక రాబడి వస్తుంది. కానీ అవి అస్థిరంగా ఉంటాయి.
డెట్ మ్యూచువల్ ఫండ్‌లు స్థిరమైన తక్కువ రాబడిని అందిస్తాయి. స్థిరమైన ఆదాయం కోసం చూస్తున్న పెట్టుబడిదారులకు ఇవి ఉపయోగం.

కాల వ్యవధి

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లు అస్థిరంగా ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడులకు (5 నుంచి 10 ఏళ్లు, అంతకంటే ఎక్కువ) ఇవి బాగుంటాయి.
చిన్న, మధ్య కాలిక లక్ష్యాలకు డెట్ మ్యూచువల్ ఫండ్‌లు అనుకూలంగా ఉంటాయి. అంటే నెలల నుంచి దాదాపు మూడేళ్ల వరకూ కాల వ్యవధికి అనుకూలంగా ఉంటాయి.

రకాలు

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, సెక్టోరల్ ఫండ్స్ ఉన్నాయి.
డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో లిక్విడ్ ఫండ్స్, షార్ట్ టర్మ్ ఫండ్స్, లాంగ్ టర్మ్ ఫండ్స్, గిల్ట్ ఫండ్స్, కార్పొరేట్‌ బాండ్ ఫండ్స్ ఉన్నాయి.

అనుకూలం

దీర్థకాలంలో రాబడిని పొందాలనుకునే వారికి, మార్కెట్‌ రిస్క్‌ను భరించే వారికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లు బాగుంటాయి.
తక్కువ రాబడి వచ్చినా మూలధనం భద్రంగా ఉండాలనుకునే వారికి డెట్ మ్యూచువల్ ఫండ్‌లు అనుకూలంగా ఉంటాయి. రిస్క్ ను ఇష్టపడి. స్వల్పకాలిక పెట్టుబడిదారులకు వీటిని క్షితిజాలు ఉన్నవారికి అనుకూలం.