వచ్చే మార్చి లోపు ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా సౌకర్యం

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సభ్యులకు కేంద్రం మరో అప్ డేట్ ఇచ్చింది. పీఎఫ్ సొమ్మును ఏటీఎం, యూపీఐ ద్వారా విత్ డ్రా విషయంలో కొత్త డెడ్ లైన్ ప్రకటించింది.


పీఎఫ్ నిధుల ఉప సంహరణ ప్రక్రియను సులభతరం చేయడంలో భాగంగా ఏటీఎం, యూపీఐ ద్వారా విత్ డ్రా చేసుకునే సదుపాయం 2026 మార్చిలోపు అందుబాటులోకి తీసుకురాబోతున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయా చెప్పారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు.

ప్రస్తుతం ఈపీఎఫ్ ఖాతాలో ఉన్న ఉద్యోగి సొంత నిధులు విత్ డ్రా చేసుకునేందుకు అనేక పత్రాలు సమర్పించాల్సి వస్తోందని దీన్ని సులభతరం చేయడమే తమ ముఖ్య ఉద్దేశం అని మంత్రి చెప్పారు. పీఎఫ్ సొమ్ము మీది. దీన్ని ఉపసంహరించుకునే ప్రక్రియను సరళతరం చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఏ కారణం చూపకుండా 75 శాతం వరకు పీఎఫ్‍ను ఉపసంహరించుకోవచ్చన్నారు. ఏటీఎంతో పీఎఫ్ విత్ డ్రాకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోందని వచ్చే మార్చిలోపు యూపీఐ విత్ డ్రా సదుపాయం తీసుకొస్తున్నామన్నారు. ఆధార్, యూఏఎన్ అనుసంధానం ఇప్పటికే పూర్తయ్యాయని ఇక పీఎఫ్ ఖాతాను బ్యాంక్ ఖాతాకు లింక్ చేయడం ద్వారా డెబిట్ కార్డుతో ఏటీఎంలో విత్ డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. కాగా కేంద్రం పీఎఫ్ విత్ డ్రాకు సంబంధించిన నిబంధనలను గత అక్టోబర్ లో సవరించిన సంగతి తెలిసిందే.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.