TVS నుంచి తొలి అడ్వెంచర్ బైక్ వచ్చిందోచ్- ధర ఎంతో తెలుసా?

 ప్రముఖ బైక్‌ల తయారీ సంస్థ TVS మోటార్స్ తన తొలి అడ్వెంచర్ మోటార్‌సైకిల్ “TVS RTX 300 ADV”ని భారత మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ ఈ మోటార్‌సైకిల్‌ను రూ. 1.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసింది. కస్టమర్లు దీన్ని బేస్, టాప్, BTO అనే మూడు వేరియంట్‌లలో కొనుగోలు చేయొచ్చు. దీని టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 2.29 లక్షలు.


TVS Apache RTX 300 ADV హార్డ్‌వేర్: కంపెనీ ఈ కొత్త “TVS Apache RTX 300″ను అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిల్‌గా తీసుకొచ్చింది. కాబట్టి ఇది పూర్తి స్థాయి ఆఫ్-రోడర్ కాదని గుర్తుంచుకోవాలి. బైక్ లాంఛ్ ఈవెంట్ సందర్భంగా, TVS ఈ మోటార్‌సైకిల్​ను ప్రధానంగా టార్మాక్ కోసం రూపొందించినట్లు స్పష్టం చేసింది. అయినప్పటికీ ఇది తేలికపాటి ఆఫ్-రోడ్ రైడింగ్ కోసం తగినంత బహుముఖ ప్రజ్ఞ(Versatility)ను కలిగి ఉంది.

ఈ బైక్​ను పూర్తిగా కొత్త స్టీల్ ట్రేల్లిస్ ఫ్రేమ్‌పై నిర్మించారు. దీని ముందు భాగంలో 41mm USD ఫోర్కులు, వెనుక భాగంలో మోనోషాక్ అబ్జార్బర్ ఉన్నాయి. రెండు వైపులా సస్పెన్షన్ ట్రావెల్ 180mm, గ్రౌండ్ క్లియరెన్స్ 200mm. ఈ బైక్ ముందు భాగంలో 19-అంగుళాల, వెనుక భాగంలో 17-అంగుళాల వీల్స్ ఉన్నాయి.

ఈ బైక్‌లో ఉపయోగించిన టైర్ల గురించి టీవీఎస్ మోటార్ మాట్లాడుతూ.. “వీటిని ప్రత్యేకంగా ఈ బైక్ కోసమే ప్రత్యేకంగా రూపొందించాం” అని పేర్కొంది. బ్రేకింగ్ విధులను రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు నిర్వహిస్తాయి. ఇవి డ్యూయల్-ఛానల్ ABSతో వస్తాయి. ఈ కొత్త TVS RTX సీటు ఎత్తు 835mm, దాని కర్బ్ బరువు 180 కిలోలు.

TVS Apache RTX 300 ADV ఫీచర్లు: దీని ఫీచర్ల గురించి చెప్పాలంటే ఈ బైక్ అద్భుతమైన ఫీచర్ల జాబితాను అందిస్తుంది. ఇది అర్బన్, రెయిన్, టూర్, ర్యాలీ అనే నాలుగు రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంది. ఈ రైడింగ్ మోడ్‌లు ABS అండ్ ట్రాక్షన్ కంట్రోల్‌ను సర్దుబాటు చేసేందుకు ఉపయోగపడతాయి. క్రూయిజ్ కంట్రోల్ కూడా అన్ని వేరియంట్లలో స్టాండర్డ్​గా ఉంటుంది.

దీని హై-స్పెక్ వేరియంట్లలో అన్ని కీలక ఫీచర్లను యాక్సెస్ చేసేందుకు డెడికేటెడ్ స్విచ్ గేర్‌తో 5-అంగుళాల TFT డిస్​ప్లే ఉంటుంది. దీనిని “TVS SmartXonnect”యాప్ ద్వారా కనెక్ట్ చేయొచ్చు. ఇది గూగుల్ మ్యాప్స్ మిర్రరింగ్, ఇతర కనెక్టివిటీ ఫీచర్లను అనుమతిస్తుంది.

కంపెనీ పన్నీర్లు, టాప్ బాక్స్‌లు, ట్యాంక్ బ్యాగులు వంటి వివిధ రకాల టూరింగ్ యాక్సెసరీల కోసం గివితో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అదనంగా ఆల్పైన్‌స్టార్స్‌తో ఉన్న సహకారంలో భాగంగా డ్యూయల్-స్పోర్ట్ హెల్మెట్‌ల నుంచి రైడింగ్ బూట్ల వరకు అడ్వెంచర్ రైడింగ్ గేర్‌ల కొత్త శ్రేణిని విడుదల చేయనుంది.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.