ఇళయ దళపతి విజయ్, స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు కాంబినేషన్‌లో వచ్చిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ది టైమ్ (The Greatest of All Time) చిత్రం రికార్డులు తిరగరాస్తున్నది. స్నేహ, లైలా లాంటి సీనియర్ హీరోయిన్లు, మీనాక్షి చౌదరీ లాంటి యంగ్ హీరోయిన్, ప్రభుదేవా, ప్రశాంత్, అజ్మల్ లాంటి సీనియర్ యాక్టర్లు నటించిన ఈ సినిమా టాక్‌తో సంబంధం లేకుండా భారీ వసూళ్లు రాబడుతున్నది. ఈ చిత్రం 4 రోజుల్లో వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
తమిళంలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ చిత్రం తమిళనాడులో హిస్టరీ క్రియేట్ చేసింది. 400 కోట్ల రూపాయలతో రూపొందించిన ఈ చిత్రం 2024లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ సినిమా ధనుష్ నటించిన రాయన్ సినిమా లైఫ్ టైమ్ కలెక్షన్లను కేవలం రెండు రోజుల్లో బ్రేక్ చేసింది.
ది గోట్ (The GOAT) చిత్రం గత 4 రోజుల్లో రాబట్టిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తమిళంలో తొలి రోజు 40 కోట్లు, రెండో రోజు 23 కోట్లు, మూడో రోజు 30 కోట్ల నికర కలెక్షన్లను వసూలు చేసింది. ఈ సినిమా కోలివుడ్‌లోనే సుమారుగా 100 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక తెలుగులో తొలి రోజు 3 కోట్ల రూపాయలు, రెండో రోజు 1.5 కోట్లు, రెండో రోజు 2 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 6.5 కోట్లు రాబట్టింది. నార్త్ ఇండియాలో ది గోట్ సినిమా హిందీ వెర్షన్‌కు బ్రహ్మండమైన ఆదరణ లభిస్తున్నది. ఈ చిత్రం తొలి రోజు 2 కోట్ల రూపాయలు, రెండో రోజు 3 కోట్లు, 3వ రోజు 3 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా గత మూడు రోజుల్లో 8 కోట్ల రూపాయలు రాబట్టింది. ఈ చిత్రం బాలీవుడ్‌లో ఒక రోజు ఆలస్యంగా రిలీజైన విషయం తెలిసిందే.
ఇక ది గోట్ చిత్రం 4వ రోజు ఆదివారం భారీ వసూళ్లు సాధించింది. తమిళంలో 30 కోట్లు రూపాయలు నికరంగా,తెలుగులో 1.5 కోట్లు, కన్నడలో 3 కోట్లు, మలయాళంలో 50 లక్షలు, హిందీలో3 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 37 కోట రూపాయల వసూళ్లు నమోదు చేసింది. దాంతో ఈ సినిమా ఇండియాలో 140 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసింది. త్రిషా కృష్ణన్, శివ కార్తీకేయన్ గెస్ట్ పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజున 126 కోట్లు, రెండో రోజున 55 కోట్ల రూపాయలు, 3వ రోజున 64 కోట్ల రూపాయలు, 4వ రోజున 60 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. దాంతో ఈ చిత్రం 305 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. కేవలం 4 రోజుల్లో ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా హిస్టరీ క్రియేట్ చేసింది.