ఆ స్పెషల్ స్కీమ్ మళ్లీ తెచ్చిన ప్రభుత్వ బ్యాంక్.. 2 లక్షలపై 444 రోజుల్లో ఎంతొస్తుందంటే?

ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన ఇండియన్ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ డెడ్‌లైన్ పొడిగిస్తున్నట్లు వెల్లడించింది.


ఇక్కడ 444 రోజుల టెన్యూర్‌తో ఇండ్ సెక్యుర్, 555 రోజుల టెన్యూర్‌తో ఇండ్ గ్రీన్ స్పెషల్ డిపాజిట్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఇన్వెస్ట్ చేసేందుకు సాధారణంగా గడువు 2025, సెప్టెంబర్ 30తోనే ముగియగా.. ఇప్పుడు మరో 3 నెలలు పొడిగించి శుభవార్త చెప్పింది. దీనిని ఇప్పుడు డిసెంబర్ 31 వరకు పొడిగించింది. అంటే అప్పటివరకు ఈ ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాల్లో చేరేందుకు అవకాశం ఉంది. ఈ బ్యాంకు సాధారణ ప్రజలకు కనీసం 2.80 శాతం నుంచి గరిష్టంగా 6.70 శాతం వరకు వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది.

ప్రత్యేక ఎఫ్‌డీ విషయానికి వస్తే.. సాధారణ డిపాజిట్ల కంటే అధిక వడ్డీ వస్తుంటుంది. ఇక్కడ 444 రోజులు, 555 రోజుల ఎఫ్‌డీలోనే ఎక్కువ వడ్డీ రేటు ఉందని చెప్పొచ్చు. ఇంకా సాధారణ ప్రజల కంటే సీనియర్ సిటిజెన్లకు దాదాపు 50 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ అధికంగా ఉంది. సూపర్ సీనియర్ సిటిజెన్లకు మరో 25 బేసిస్ పాయింట్ల వరకు అధిక వడ్డీ వస్తుంది.

>> 444 రోజుల వ్యవధితో ఉన్న ఇండ్ సెక్యుర్ ఎఫ్‌డీలో సాధారణ ప్రజలకు వడ్డీ రేటు అత్యధికంగా 6.70 శాతంగా ఉండగా.. సీనియర్ సిటిజెన్లకు 7.20 శాతం, సూపర్ సీనియర్ సిటిజెన్లకు 7.45 శాతం వడ్డీ రేట్లు ఉన్నాయి. ఇక్కడ రూ. 2 లక్షలు ఒకేసారి డిపాజిట్ చేసినట్లయితే ఇక్కడ మెచ్యూరిటీకి అంటే 444 రోజుల్లో సాధారణ ప్రజలకు రూ. 16,836 వడ్డీ వస్తుంది. సీనియర్ సిటిజెన్లకు రూ. 18, 136; సూపర్ సీనియర్ సిటిజెన్లకు రూ. 18,789 వడ్డీ అందుతోంది. ఇక్కడ కనీసం రూ. 1000 నుంచి గరిష్టంగా రూ. 3 లక్షల వరకు డిపాజిట్లపై ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి.

555 రోజుల వ్యవధితో ఇండ్ గ్రీన్ స్పెషల్ ఎఫ్‌డీ ఉండగా.. ఇక్కడ వడ్డీ రేట్లు సాధారణ ప్రజలకు 6.60 శాతం, సీనియర్ సిటిజెన్లకు 7.10 శాతం, సూపర్ సీనియర్ సిటిజెన్లకు 7.35 శాతంగా ఉన్నాయి. ఇక్కడ రూ. 2 లక్షలు ఒకేసారి జమ చేస్తే.. వరుసగా మెచ్యూరిటీకి రూ. 20931; రూ. 22,589; రూ. 23,422 వడ్డీ వస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.