ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన హీరోయిన్ ప్రియమణి.. త్వరలో ‘గుడ్ వైఫ్’ అనే సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. అమెరికన్ సిరీస్‌కు రిమేక్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌లో ప్రియమణి లాయర్‌గా నటిస్తుండగా..
ఆమె భర్త పాత్రలో సంపత్ రాజ్ కనిపించనున్నారు. భర్త, కొడుకు కూతురుతో సంతోషంగా ప్రియమణి ఫ్యామిలీకి అనుకోని ఓ సమస్య ఎదురవుతోంది. సెక్స్ కుంభకోణంలో చిక్కుకున్న భర్తని రక్షించుకునేందుకు భార్య (ప్రియమణి) ఏం చేసిందనేది ఈ సిరీస్ కథ అని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్‌కు సంబంధించి అప్డేట్ వచ్చింది. ‘గుడ్ వైఫ్’ స్ట్రీమింగ్ హక్కులు జియో హాట్ స్టార్ సొంతం చేసుకోగా.. జూలై 4వ తేదీ నుండి తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ & మరాఠీలో స్ట్రీమింగ్‌కు తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. ఇక రిలీజ్ చేసిన పోస్టర్‌లో ప్రియమణి లాయర్ కోర్టులో హుందాగా చేతులు కట్టుకుని కనపించగా.. వెనుక తన భర్త చేతులకు బేడీలు వేసి పోలీసులు తీసుకెళ్తున్నట్లు చూపించారు.
































