మధ్యతరగతి సొంత కారు కల ఇక నిజం: రూ.6 లక్షలకే 7-సీటర్ కారు

ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో మధ్యతరగతి కుటుంబాల నాడిని పట్టుకోవడంలో మారుతి సుజుకి ఎర్టిగా ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉంది. అయితే అదే ధరకు రెట్టింపు ఫీచర్లతో అంతకంటే తక్కువ ధరకే 7 మంది ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తూ జపాన్ దిగ్గజం నిస్సాన్ సరికొత్త విప్లవానికి తెరలేపింది.


అదే నిస్సాన్ గ్రావైట్(Nissan Gravite). కేవలం రూ.5.75 లక్షల నుంచి రూ.6 లక్షల ప్రారంభ ధరతో వస్తున్న ఈ కారు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ధరలో భారీ తేడా.. ఎర్టిగాకు గట్టి పోటీ

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మారుతి ఎర్టిగా బేస్ వేరియంట్ ధర సుమారు రూ.8.80 లక్షల(ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. కానీ నిస్సాన్ గ్రావైట్ దాదాపు రూ.3 లక్షల తక్కువ ధరకే లభించనుంది. ఇంత తక్కువ ధరలో 7-సీటర్ రావడం అనేది సామాన్య కుటుంబాలకు ఓ గొప్ప వరమనే చెప్పాలి.

ఇంజన్, పనితీరు

నిస్సాన్ గ్రావైట్ కారును రెనో ట్రైబర్ నిర్మించిన CMF-A+ ప్లాట్‌ఫారమ్‌పైనే తయారు చేశారు. ఇది కాంపాక్ట్ 7-సీటర్ అయినప్పటికీ.. లోపల స్థల విషయంలో ఎక్కడా తగ్గదు. ఇది 2026 జనవరిలో అధికారికంగా విడుదలై, మార్చి నాటికి కస్టమర్ల చేతికి వచ్చే అవకాశం ఉంది. ఈ కారులో 1.0 లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు. ఇది 76 hp శక్తిని, 95 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ (AMT) వేరియంట్లలో గేర్ బాక్స్ అందుబాటులో ఉంటుంది. మధ్యతరగతి వారిని దృష్టిలో ఉంచుకుని లీటరుకు 18-20 కి.మీ మైలేజీ ఇచ్చేలా దీనిని రూపొందించారు.

భద్రతలో రాజీ లేదు

తక్కువ ధర కదా అని నిస్సాన్ భద్రతా ప్రమాణాలను విస్మరించలేదు. ఈ కారులో సాధారణంగా ఖరీదైన కార్లలో ఉండే ఫీచర్లను అందించడం విశేషం. అన్ని వేరియంట్లలోనూ 6 ఎయిర్‌బ్యాగ్‌లు ప్రామాణికంగా వస్తున్నాయి. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), ట్రాక్షన్ కంట్రోల్ (TCS), టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి కీలక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

లగ్జరీ ఇంటీరియర్, స్టైలిష్ లుక్

తక్కువ బడ్జెట్ లోనే ప్రీమియం అనుభూతిని ఇచ్చేలా నిస్సాన్ దీనిని తీర్చిదిద్దింది. కారు ముందు భాగంలో హనీకోంబ్ గ్రిల్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ దీనికి స్టైలిష్ లుక్ ఇస్తాయి. 8-అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. వెనుక సీట్లలో ప్రయాణించే వారి కోసం ప్రత్యేక ఏసీ వెంట్లను ఏర్పాటు చేశారు.

విడుదల ఎప్పుడు?

నిస్సాన్ గ్రావైట్ 2026 జనవరిలో అధికారికంగా విడుదల కానుంది. మార్చి 2026 నాటికి బుకింగ్ చేసుకున్న కస్టమర్ల చేతికి ఈ కారు అందుతుంది. తక్కువ ధర, అత్యుత్తమ మైలేజీ, 6 ఎయిర్‌బ్యాగ్‌ల భద్రతతో వస్తున్న నిస్సాన్ గ్రావైట్, భారతదేశంలోని ఎంపీవీ (MPV) మార్కెట్ రూపురేఖలను మార్చేయడం ఖాయం. ముఖ్యంగా భారీ బడ్జెట్ పెట్టలేక 7-సీటర్ కారును వాయిదా వేసుకుంటున్న కుటుంబాలకు ఇది ఒక అద్భుతమైన అవకాశం.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.