New Rules: ఇక రూల్స్‌ మరింత కఠినతరం.. జూలై 1 నుంచి అమలు కానున్న కొత్త నిబంధనలు

ప్రతి నెల కొత్త కొత్త మార్పులు జరుగుతుంటాయి. వినియోగదారులు ప్రతినెల రాగానే ఏయే విషయాలలో కొత్త నిబంధనలు మారనున్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ మార్పులు మీకు నేరుగా సంబంధించినవి కాబట్టి, మీరు వాటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.


నిబంధనలపై అవగాహన లేకపోవడం వల్ల, ఒక వ్యక్తి ఎటువంటి కారణం లేకుండా చాలాసార్లు ఫీజు చెల్లించాల్సి వస్తుంది. అలాగే చాలా సార్లు, గడువు తేదీలు తెలియకపోవడం వల్ల కొన్ని పనులు ఆగిపోతాయి.

జూలై 1 నుంచి మొబైల్ నంబర్ పోర్టబిలిటీ నిబంధనలు మారనున్నాయి. టెలికాం నియంత్రణ సంస్థ TRAI SIM కార్డ్ దొంగతనం లేదా SIM స్వాప్ మోసాన్ని నిరోధించడానికి లాకింగ్ వ్యవధిని ఏడు రోజులకు పొడిగించింది. అంటే ఇప్పుడు మీరు సిమ్‌ పోర్ట్‌ పెట్టుకున్నట్లయితే వెంటనే పొందలేరు.

దాని కోసం మీరు ఏడు రోజులు వేచి ఉండవలసి ఉంటుంది.
జూలైలో మీ మొబైల్‌కి రీఛార్జ్ చేయడానికి మీరు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. రిలయన్స్ జియో, వొడాఫోన్-ఐడియా, ఎయిర్‌టెల్ తమ టారిఫ్‌లను పెంచడమే దీనికి కారణం.
ప్రతి నెలా మొదటి తేదీన, పెట్రోలియం కంపెనీలు LPG సిలిండర్లు, టీటీఎఫ్‌ ధరలను సవరిస్తాయి. అటువంటి పరిస్థితిలో మీరు జూలై 1 నుండి గ్యాస్ సిలిండర్‌పై కూడా ఉపశమనం పొందవచ్చు.
క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపుకు సంబంధించిన కొత్త నిబంధనలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇందులో అన్ని బ్యాంకులు భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా క్రెడిట్ కార్డ్ చెల్లింపులను ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది.

అయితే, బ్యాంకులు ఇంకా ఈ సూచనలను పాటించలేదు. ఇప్పటి వరకు 8 బ్యాంకులు మాత్రమే బీబీపీఎస్‌లో బిల్లు చెల్లింపును యాక్టివేట్ చేశాయి.
మీకు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఖాతా ఉండి, ఎక్కువ కాలం ఉపయోగించకుంటే, జూలై 1 నుంచి అది పనిచేయదు. ఏప్రిల్ 30, 2024 నాటికి, 3 సంవత్సరాలకు పైగా వాడుకలో లేని ఖాతాలు ఇప్పుడు ఒక నెలలో మూసివేయబడతాయని బ్యాంక్ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. కస్టమర్‌లను అసౌకర్యం నుండి కాపాడేందుకు బ్యాంక్ 30 జూన్ 2024 వరకు గడువు విధించింది.