ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ నుంచి అల్కాజార్ అప్‌డేటెట్ వెర్షన్ విడుదలైంది. దీని కోసం కార్ల వినియోగదారులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.
ఈ కొత్త ఎస్ యూవీ టర్బో పెట్రోల్, డీజీల్ ఇంజిన్లతో అందుబాటులోకి వచ్చింది. టర్బో పెట్రోల్ రూ.14.99 లక్షలకు, డీజిల్ వెర్షన్ రూ.15.99 లక్షలకు అందుబాటులో ఉంది. అలాగే ప్లాటినం, సిగ్నేచర్, ప్రెస్టీజ్, ఎగ్జిక్యూటివ్ అనే నాలుగు రకాల వేరియంట్లలో విడుదల కానుంది. అల్కాజార్ ఎస్ యూవీ కోసం బుక్కింగ్ లు కూడా మొదలయ్యాయి. ఆసక్తి కలవారు ఆన్ లైన్ లో లేదా సమీపంలోని డీలర్ షిప్ షోరూమ్ లలో రూ.25 వేలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు.
డిజైన్ ఇలా..
కొత్త అల్కాజార్ కారు డిజైన్ పరంగా చాలా మెరుగ్గా ఉంది. ఫీచర్లు, ఇంటీరియర్ లేఅవుట్, స్టైలిష్ లుక్ ఆకట్టుకుంటున్నాయి. క్వాడ్ బీమ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు ఏర్పాటు చేశారు. పెట్రోల్, డీజిల్ వెర్షన్ల కోసం ప్రత్యేక గ్రిల్ డిజైన్ రూపొందించారు. వెనుకవైపు వెడల్పు గల టెయిల్ ల్యాంప్‌లను అమర్చారు. ఈ కొత్త టెయిల్ ల్యాంప్‌లు, రీడిజైన్ చేయబడిన బంపర్లతో కలిపి వాహనానికి మునుపటి మోడల్ కంటే ఎక్కువ అందాన్ని తెచ్చాయి. అలాగే 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, ఫంక్షనల్ రూఫ్ రెయిల్ ఆకట్టుకుంటున్నాయి. వీటితో పాటు అట్లాస్ వైట్, అబిస్ బ్లాక్ పెర్ల్, రేంజర్ ఖాకీ, ఫైరీ రెడ్, రోబస్ట్ ఎమరాల్డ్ పెర్ల్, స్టార్రీ నైట్, టైటాన్ గ్రే మ్యాట్, అట్లాస్ వైట్ విత్ అబిస్ బ్లాక్ రూఫ్ అనే ఎనిమిది రకాల ఎక్స్‌టీరియర్ పెయింట్ స్కీమ్‌లను ఖాతాదారులు ఎంపిక చేసుకోవచ్చు.
ఇంటీరియర్ డిజైన్..
ఇంటీరియర్ లేఅవుట్ కొత్త క్రెటా మాదిరిగానే ఉంటుంది. డ్యాష్‌బోర్డ్ క్రెటా కంటే ఎక్కువ ప్రీమియంగా కనిపిస్తుంది. 6, 7 సీటర్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంది. క్రెటా ఫేస్‌లిఫ్ట్ లోని చాలా ఫీచర్లను దీనిలో వాడారు. 6 సీట్ లేఅవుట్ ఎంపికలో రెండో వరుసలో కెప్టెన్ సీట్లు ఉన్నాయి.
ఆకట్టుకునే ఫీచర్లు..
అల్కాజార్ ఫేస్ లిఫ్ట్ లో అనేక ఫీచర్లు ఉన్నాయి. ఇన్ఫోటైన్‌మెంట్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కనెక్ట్ చేయబడిన కార్ టెక్, ఆపిల్ కార్ ప్లే/ ఆండ్రాయిడ్ ఆటో, డ్యూయల్ వైర్‌లెస్ ఛార్జర్లు, టైప్ సీ యూఎస్ బీ పోర్టులు, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్రైవర్ కోసం రెండు స్థాయిల మెమరీ ఫంక్షన్‌తో కూడిన వే పవర్డ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, వాయిస్ కమాండ్లు వోటీఏ అప్‌డేట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్, ఆటో హెడ్‌లైట్లు, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, యాంబియంట్ లైటింగ్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
భద్రతకు ప్రాధాన్యం..
భద్రత పరంగా కారులో అనేక ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 360 డిగ్రీ కెమెరా, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు (స్టాండర్డ్), ఐఎస్ వోఎఫ్ఐఎక్స్ చైల్డ్ సీట్ మౌంట్‌లు, టీసీఎస్, స్టెబిలిటీ కంట్రోల్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, ఫార్వర్డ్ కొలిషన్-అవాయిడెన్స్ అసిస్ట్ (కారు, పాదచారులు) వంటి లెవెల్ 2 అడాస్ ఫీచర్లు ఏర్పాటు చేశారు. సైక్లిస్ట్, జంక్షన్ టర్నింగ్ , లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ ఫాలోయింగ్ అసిస్ట్, స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్ విత్ స్టాప్ అండ్ గో, లీడింగ్ వెహికల్ డిపార్చర్ అలర్ట్, హై బీమ్ అసిస్ట్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్, సేఫ్ ఎగ్జిట్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ కొలిషన్-అవాయిడెన్స్ అసిస్ట్, రియర్ క్రాస్ ట్రాఫిక్ వార్నింగ్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి.
ఇంజిన్ ఎంపికలు..
అల్కాజార్ రెండు రకాల ఇంజిన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. 1.5 లీటర్, 4 సిలిండర్, టర్బో ఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ అలాగే 1.5 లీటర్, 4 సిలిండర్, టర్బో ఛార్జ్డ్ డీజిల్ ఇంజిన్ తో వస్తోంది. పెట్రోల్ ఇంజిన్ 160 హెచ్ పీ శక్తి, 253 ఎన్ఎం టార్క్ విడుదల చేస్తుంది. డీజిల్ ఇంజిన్ నుంచి 116 హెచ్ పీ, 250 ఎన్ఎం శక్తి విడుదలవుతుంది.