భారతదేశంలో ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో ఫోన్లు, మెసేజ్‌లకు మాత్రమే పరిమితమైన ఫోన్లు ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతుల్లో తప్పనిసరిగా ఉంటున్నాయి. అమెరికా, చైనా తర్వాత స్మార్ట్ ఫోన్ అమ్మకాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో అన్ని కంపెనీలు భారతదేశంలో సరికొత్త స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా ఇటీవల మోటో జీ-85నులాంచ్ చేసింది. ప్రీమియం లుక్‌తో అధునాత ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్‌ను యువత అమితంగా ఇష్టపడుతున్నారు. కేవలం రూ.17999కే కర్వ్‌డ్ డిస్‌ప్లేతో ఈ ఫోన్ లాంచ్ చేయడంతో మహిళలు ఈ ఫోన్ వాడకాన్ని ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో మోటో జీ-85 గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
స్లిమ్ డిజైన్‌తో లాంచ్ చేసిన మోటో జీ-85 కేవలం 175 గ్రాముల బరువు మాత్రమే ఉంది. అంతేకాకుండా స్లిమ్ అండ్ స్టైలిష్ డిజైన్ యువతను ఆకర్షిస్తుంది. వేగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్‌తో వచ్చే ఈ స్మార్ట్ ఫోన్ మూడు-రంగు ఎంపికల్లో అందుబాటులో ఉంటుంది. ఆలివ్ గ్రీన్, అర్బన్ గ్రే, కోబాల్ట్ బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. వెనుక ప్యానెల్‌లో చిన్న ఫ్లాష్‌లైట్‌తో పాటు డ్యూయల్ కెమెరా సెటప్ ఆకర్షణీయంగా ఉంది. మోటో జీ-85 ఫోన్ 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల పీఓఎల్ఈడీ కర్వ్డ్-డిస్‌ప్లేతో వస్తుంది. 1600నిట్‌ల గరిష్ట ప్రకాశంతో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఈ ఫోన్ ప్రత్యేకత. స్నాప్‌డ్రాగన్ 6 జెన్-3 చిప్‌సెట్‌తో పాటు 12 జీబీ + 256 జీబీ వేరియంట్ ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. అలాగే ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పని చేసే ఈ ఫోన్‌లో రెండు సంవత్సరాల ఓఎస్ అప్‌గ్రేడ్ వస్తుంది.
మోటో జీ-85 ఫోన్ స్మార్ట్‌ఫోన్ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో పని చేస్తుంది. ఈ ఫోన్ 0 శాతం నుండి 100 శాతానికి ఛార్జ్ చేయడానికి 80 నిమిషాలు పడుతుందని వినియోగదారులు చెబుతున్నారు. అలాగే ఈ ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50-మెగాపిక్సెల్ సోనీ లైట్-600 సెన్సార్‌తో వెనుక డ్యూయల్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ ఫొటో ప్రియులను అమితంగా ఆకట్టుకుంటుంది. అలాగే గరిష్టంగా 10ఎక్స్ జూమ్ వద్ద ఫొటోలు చాలా నిలకడగా వస్తున్నాయని యూజర్లు చెబుతున్నారు. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 32 మెగాపిక్సెల్ షూటర్, అధిక-నాణ్యత స్వీయ-పోర్ట్రెయిట్‌లు, వీడియో కాల్స్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. మోటో జీ – 85 భారతదేశంలో రూ. 17,999 ధరతో అందుబాటులో ఉంటుంది. అలాగే యాక్సిస్ బ్యాంక్‌తో కంపెనీ రూ. 1,000 బ్యాంక్ తగ్గింపును కూడా అందిస్తోంది.