తులం బంగారం దాదాపు 25 వేల రూపాయిలే. ఈ మాట వినడానికి చాలా హాయిగా ఉంటుంది. వెంటనే ఫేస్ లో అవునా అనే ఎక్స్ ప్రెషన్ వస్తుంది. పది గ్రాముల బంగారం ధర 70 వేల రూపాయిలకు పైగానే ఉంది.
మరి దాదాపు 25 వేల రూపాయిలకు ఎలా వస్తుంది అనుకోవచ్చు. కానీ ఇది నిజమే. ఇక్కడ రేటులో నెంబర్లు ఏమీ మారలేదు. కాకపోతే పుత్తడి ధరలు నానాటికీ భారీగా పెరుగుతుండడంతో కేంద్రప్రభుత్వం గోల్డ్ ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనుకుంటోంది.
అందుకే తక్కువ క్యారెట్ల బంగారాన్ని అమ్మడానికి ఆలోచిస్తోంది. అంటే.. 24 క్యారెట్లు, 22 క్యారెట్లకు బదులు.. 9 క్యారెట్లన్న మాట. క్యారెట్ ఎప్పుడు తగ్గిందో.. దాని రేటు కూడా ఆటోమేటిగ్గా తగ్గిపోతుంది.