వర్షం పడుతున్న సమయంలో పచ్చని పొలాలతో ఉన్న రోడ్డుపై డ్రైవ్ చేయడం అనేది చాలా మందికి ఇష్టం. సొంత కారు ఉన్న చాలా మంది వర్షం పడ్డాక డ్రైవింగ్‌ను ఇష్టపడుతూ ఉంటారు.
అయితే వర్షం సమయంలో డ్రైవింగ్ చేయడం ఆహ్లాదంగా ఉన్నా అనుకోని ప్రమాదాల నుంచి బయటపడాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో డ్రైవింగ్ చేసే సమయంలో పొగమంచు చాలా ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా మన కారు అద్దానికి పొగమంచు కప్పేసి రోడ్డు కనిపించకుండా చేస్తుంది. అయితే ఇలాంటి సమయంలో కిటికీను తెరిచి ఉంచాలని కొందరు అనుకుంటూ ఉంటారు. అయితే అది మెరుగైన ఎంపిక అయినప్పటికీ కొన్ని ప్రత్యేక పద్ధతులను పాటిస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ నేపథ్యంలో వర్షకాలంలో పొగమంచు ఇబ్బంది నుంచి బయటపడడానికి నిపుణులు సూచించే టిప్స్‌ను తెలుసుకుందాం.
హీటర్ ఆన్ చేయడం
పొగమంచు విండీ షీల్డ్ నుంచి వదిలించుకోవడానికి ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి కారు హీటర్ ఆన్ చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. బ్లోయర్‌ను ఉపయోగిస్తే వేడి గాలి కారణంగా పొగమంచు ఆవిరైపోతుంది. ముఖ్యంగా ఇది గ్లాస్‌పై తేమను త్వరగా ఆవిరి అవుతుంది. అలాగే విండ్ షీల్డ్ డీఫాగ్ చేస్తుంది.
ఏసీను ఉపయోగించడం
కారులో ఉన్న ఏసీను ఉపయోగించే విండ్ షీల్డ్‌ను డీఫాగ్ చేయవచ్చు. చల్లటి గాలి ఉష్ణోగ్రత విండీషీల్డ్‌పై తేమను మరింత పెంచుతుంది. అనంతరం దాన్ని తుడిచి వేస్తే పొగమంచు పోతుంది. అయితే ఏసీ అత్యల్ప సెట్టింగ్కు సెట్ చేయండి మరియు విండ్ షీల్డ్ మరియు కిటికీల వైపు వెంట్లను సూచించండి.
కిటికీలను దింపడం
విండోస్‌పై పొగమంచును తొలగించడానికి కిటికీలను కిందకు దించవచ్చు. ఇలా చేస్తే కారులో స్వచ్ఛమైన గాలిని ప్రసరించి క్యాబిన్ లోపల ఉన్న పొగమంచు ఆవిరైపోతుంది.
యాంటీ ఫాగ్ సొల్యూషన్
మార్కెట్లో వివిధ రకాల యాంటీ ఫాగ్ సొల్యూషన్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ యాంటీ ఫాగ్ సొల్యూషన్స్ సాధారణంగా స్ప్రే బాటిల్లో వస్తాయి. విండీ షీల్డ్ పై ద్రావణాన్ని స్పే చేసి, శుభ్రమైన గుడ్డతో తుడిచివేయాలి. అనంతరం ఇది గ్లాస్‌పై రసాయన పొరను సృష్టిస్తుంది. ఈ ద్రావణంలోని రసాయనాలు విండీ షీల్డ్ పై తేమ పేరుకుపోకుండా చేస్తాయి.