ఎక్స్-షోరూమ్ ధర రూ.1.88 లక్షలుగా నిర్ణయించిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను హర్యానాలోని గురుగ్రామ్ ప్లాంట్‌లో తయారు చేయనున్నారు. ఈ లాంచ్‌తో సుజుకీ ఎలక్ట్రిక్ మొబిలిటీ సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టింది.
సుజుకీ e-Access అండర్‌బోన్ ఫ్రేమ్‌పై నిర్మించబడింది. ఇందులో 3.07 kWh లిథియమ్ ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీని అందించారు. ఇది ఒకసారి పూర్తి ఛార్జ్‌తో 95 కిలోమీటర్ల రేంజ్ ఇవ్వగలదు. ఈ స్కూటర్‌లో ఉన్న 4.1 kW ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 15 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. పోర్టబుల్ ఛార్జర్ ఉపయోగించి బ్యాటరీని 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 4 గంటలు 30 నిమిషాలు పడుతుంది. ఫాస్ట్ ఛార్జర్‌తో అయితే కేవలం 2 గంటలు 12 నిమిషాల్లో బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అవుతుంది.
ఫీచర్ల పరంగా e-Access ఆధునిక సౌకర్యాలతో ఆకట్టుకుంటుంది. ఇందులో ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మూడు రైడింగ్ మోడ్‌లు ఎకో, రైడ్ A, రైడ్ B (Eco, Ride A, Ride B) రెజెనరేటివ్ బ్రేకింగ్, రివర్స్ మోడ్ ఉన్నాయి. అలాగే బ్లూటూత్ తో యాప్ కనెక్టివిటీ, USB ఛార్జింగ్ పోర్ట్ కూడా అందుబాటులో ఉన్నాయి.
డిజైన్ విషయంలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు మోడర్ ను లుక్ ఇచ్చారు. LED లైటింగ్, టూ-టోన్ అల్లాయ్ వీల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కొత్తగా మెటాలిక్ మ్యాట్ స్టెల్లార్ బ్లూ & మెటాలిక్ మ్యాట్ ఫైబ్రోయిన్ గ్రే (Metallic Matte Stellar Blue & Metallic Matte Fibroin Gray) కలర్ ఆప్షన్‌ను పరిచయం చేశారు. దీంతో e-Access మొత్తం నాలుగు కలర్ వేరియంట్స్లో అందుబాటులోకి వచ్చింది. బోర్డియక్స్ రెడ్‌తో మెటాలిక్ మ్యాట్ బ్లాక్ (Metallic Matte Black with Bordeaux Red), మెటాలిక్ మ్యాట్ ఫైబ్రోయిన్ గ్రేతో పెర్ల్ గ్రేస్ వైట్ (Pearl Grace White with Metallic Matte Fibroin Gray), మెటాలిక్ మ్యాట్ ఫైబ్రోయిన్ గ్రేతో పెర్ల్ జాడే గ్రీన్ (Pearl Jade Green with Metallic Matte Fibroin Gray) వంటి ఇతర రంగులలో దొరుకుతుంది.



































