AIతో ఈ 40 రకాల ఉద్యోగులకు పొంచి ఉన్న ప్రమాదం

గుండెను గట్టిగా పట్టుకోండి. 40 రకాల ఉద్యోగాలను ఏఐ మింగేయనుంది. మీరు ఈ నలభై రంగాల్లో పని చేస్తున్నట్టు అయితే మాత్రం వెంటనే మేల్కోండి.


లేకుంటే మీ ఉద్యోగాలు ఉడిపోనున్నాయి. ఇది ఎవరో అనామక సంస్థలు చేసిన చేసిన సర్వే కాదు. మైక్సోసాఫ్ట్‌ చేసిన సర్వేలో తేలిన వాస్తవాలు. 40 రంగాలకు చెందిన వ్యక్తులు కచ్చితంగా మేల్కోవాల్సిన టైం వచ్చిందని అంటున్నారు.

ఇంటర్‌ప్రెటర్లు ,ట్రాన్స్‌లేటర్లతోపాటు, AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ముప్పులో ఉన్న అనేక ఇతర ఉద్యోగాలు ఉన్నాయని మైక్రోసాఫ్ట్‌ పేర్కొంది. వీటిలో, చరిత్రకారులు, సేల్స్‌ రిప్రజంటేటివ్స్‌, పాసింజర్స్ అటెండర్స్‌ వంటి ఉద్యోగాలు AI వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది.

AIతో స్నేహం చేయండి

సాధారణంగా, AI గురించి ప్రస్తావించినప్పుడల్లా, దీని కారణంగా, IT, కన్సల్టెన్సీ, రీసెర్చ్‌, రచాయిత ఉద్యోగాలకులకు భవిష్యత్తు లేదని చాలా మంది భావిస్తారు. మైక్రోసాఫ్ట్ స్టడీ దీని నుంచి చాలా ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. AI ద్వారా ఎక్కువగా ప్రభావితమయ్యే పరిశ్రమలు సాంకేతికతతో పోరాడటం కంటే దాంతో స్నేహం చేయాలని కో-పైలట్‌గా ఎలా ఉపయోగించాలో నేర్చుకోవాలని మైక్రోసాఫ్ట్ చెబుతోంది.

AI కారణంగా అధిక-ఓవర్‌లాప్ జాబితాలో అగ్రస్థానంలో కస్టమర్ రిప్రజెంటేటివ్స్‌ ఉన్నారు, వారు దాదాపు 2.86 మిలియన్ల మందితో అనుసంధానమై ఉన్నారు. దీనితో పాటు, AIపై ఈ అధ్యయనం రైట్స్‌, జర్నలిస్టులు, ఎడిటర్లు, ట్రాన్స్‌లేటర్స్‌, ప్రూఫ్ రీడర్‌లకు ఒక హెచ్చరిక చేస్తోంది. వెబ్ డెవలపర్లు, డేటా సైంటిస్టులు, పిఆర్ నిపుణులు, వ్యాపార విశ్లేషకుల రంగాలలో ఉన్న వారి ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉంది. చాట్‌జిపిటి, కోపైలట్ వంటి AI సాధనాలు ఇప్పటికే ఈ ఉద్యోగాలలో ఉపయోగిస్తున్నారు.

AI వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యే ఉద్యోగాలు

  • ఇంటర్‌ప్రిటర్స్‌ అండ్‌ ట్రాన్స్‌లేటర్స్‌
  • సోషల్ సైన్స్ రీసెర్చ్‌ అసిస్టెంట్స్‌
  • చరిత్రకారులు
  • సోషియాలజిస్ట్‌లు
  • పొలిటికల్ సైంటిస్ట్స్
  • మీడియేటర్స్‌ అండ్‌ కన్సిలియేటర్లు
  • పబ్లిక్ రిలేషన్ స్పెషలిస్ట్
  • ఎడిటర్స్‌
  • క్లినికల్ డేటా మేనేజర్
  • రిపోర్టర్లు అండ్‌ జర్నలిస్టులు
  • టెక్నికల్ రైటర్
  • కాపీ రైటర్
  • ప్రూఫ్ రీడర్లు అండ్‌ కాపీ మార్కర్లు
  • కరస్పాండెన్స్ క్లర్క్
  • కోర్ట్ రిపోర్టర్
  • రైటర్స్ అండ్‌ ఆథర్స్‌
  • పోస్ట్ సెకండరీ టీచర్ (కమ్యూనికేషన్, ఇంగ్లీష్, హిస్టరీ)
  • మానసిక ఆరోగ్యం, మాదకద్రవ్య వ్యసనం సామాజిక కార్యకర్త
  • క్రెడిట్ కౌన్సెలర్
  • ట్యాక్స్ ప్రిపేరర్స్‌
  • పారా లీగల్స్ అండ్‌ లీగల్ అసిస్టెంట్లు
  • లీగల్ సెక్రటరీ
  • టైటిల్ ఎగ్జామినర్లు, సెర్చర్లు
  • కంపెన్షీయన్స్‌, బెనిఫిట్స్‌, అండ్‌ ఉద్యోగ విశ్లేషణ నిపుణుడు
  • మార్కెట్ రీసెర్చ్‌రిప్రజెంటేటివ్స్‌
  • మేనేజ్మెంట్ అనలిస్ట్స్‌
  • ఫండ్‌ రైజర్స్‌
  • మానవ వనరుల నిపుణుడు (HR)
  • కస్టమర్ సర్వీస్ ప్రతినిధి
  • సేల్స్ ప్రతినిధి (సేల్స్)
  • ఇన్సూరెన్స్‌ అండర్ రైటర్
  • క్లెయిమ్స్ అడ్జస్టర్, ఎగ్జామినర్, ఇన్వెస్టిగేటర్
  • లోన్ ఆఫీసర్
  • ఫైనాన్సియల్‌ఎగ్జామినర్‌
  • బడ్జెట్ విశ్లేషకుడు
  • శిక్షణ అండ్‌ అభివృద్ధి నిపుణుడు
  • కంప్యూటర్ సిస్టమ్స్ విశ్లేషకుడు
  • డేటా శాస్త్రవేత్త
  • డేటాబేస్ ఆర్కిటెక్ట్
  • ట్రావెల్ ఏజెంట్

AI ద్వారా అతి తక్కువ ప్రభావితం అయ్యే ఉద్యోగాల జాబితా

  • బ్రిడ్జ్ అండ్‌ లాక్ టెండర్లు
  • పంప్ ఆపరేటర్
  • కూలింగ్ అండ్ ఫ్రీజింగ్ ఎక్విప్‌మెంట్ ఆపరేటర్
  • పవర్ డిస్ట్రిబ్యూటర్ & డిస్పాచర్
  • అగ్నిమాపక పర్యవేక్షకుడు
  • వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఆపరేటర్
  • వేస్ట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఆపరేటర్
  • క్రషింగ్, గ్రైండింగ్ మెషిన్ ఆపరేటర్
  • నిర్మాణ కార్మికుడు
  • రూఫర్లు
  • సిమెంట్ మేసన్ & కాంక్రీట్ ఫినిషర్
  • లాగింగ్ ఎక్విప్‌మెంట్ ఆపరేటర్
  • పైప్‌లేయర్లు
  • మైన్ కటింగ్ మెషిన్ ఆపరేటర్
  • టెర్రాజో కార్మికులు
  • సెప్టిక్ ట్యాంక్ సర్వీసర్
  • రీబార్ టైయింగ్ కార్మికులు
  • ప్రమాదకర పదార్థాల తొలగింపు కార్మికులు
  • టైర్ బిల్డర్
  • కంచె ఎరక్టర్లు
  • డెరిక్ ఆపరేటర్ (ఆయిల్ & గ్యాస్)
  • రూట్స్ అబౌట్ (ఆయిల్ & గ్యాస్)
  • ఫర్నేస్, కిల్న్, ఓవెన్ ఆపరేటర్
  • ఇన్సులేషన్ వర్కర్
  • స్ట్రక్చరల్ ఐరన్ మరియు స్టీల్ వర్కర్
  • ప్రమాదకర వ్యర్థ సాంకేతిక నిపుణుడు
  • ఫ్లెబోటోమిస్ట్ (రక్త నమూనా సేకరించేవాడు)
  • ఎంబామర్లు
  • మసాజ్ థెరపిస్ట్
  • ఫిజికల్ థెరపిస్ట్ అసిస్టెంట్
  • కన్స్ట్రక్షన్ సూపర్‌వైజర్
  • ఎక్స్‌కవేటర్ మెషిన్ ఆపరేటర్
  • డ్రిల్లింగ్ అం్‌ బోరింగ్ మెషిన్ ఆపరేటర్
  • హోస్ట్ అం్‌ వించ్ ఆపరేటర్
  • ఇండస్ట్రియల్ ట్రక్ అండ్‌ ట్రాక్టర్ ఆపరేటర్లు
  • డిష్ వాషర్
  • జానిటర్లు అండ్‌ క్లీనర్లు
  • మెయిడ్స్ అండ్‌ హౌస్ కీపింగ్ క్లీనర్లు

మొత్తంమీద, మైక్రోసాఫ్ట్ చేసిన ఈ అధ్యయనం ప్రకారం, AI మానవులను భర్తీ చేయడం లేదు, ఇది పని చేసే విధానాన్ని మాత్రమే మారుస్తోంది. పని చేస్తున్నప్పుడు మనం దాని సహాయం పొందవచ్చు. అటువంటి పరిస్థితిలో, రాబోయే మార్పులకు అనుగుణంగా అండ్‌ AI గురించి మన అవగాహనను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. AI ప్రతిదీ కాపీ చేయదు ఎందుకంటే లోతైన ఆలోచన, విమర్శనాత్మక ఆలోచన అవసరమయ్యే అనేక విషయాలు కానీ AI చేయలేనివి ఉన్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.