నిజం… ఇక, ఏపీ దశ తిరిగినట్టే

సీఎం చంద్రబాబు ఆలోచన.. రతన్ టాటా సంస్థల చొరవ.. కలిసి.. ఏపీ దశ-దిశను మార్చేయడం ఖాయ మనే చర్చ సాగుతోంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ల ఏర్పాటుతో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఆశలు చిగురిం చాయి.


ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే.. ఇప్పటి నుంచి మరో ఎత్తు అన్నట్టుగా రాష్ట్రంలో అభివృద్ధి సాకారం అవుతుందని సర్కారు కూడా అంచనాకు వచ్చింది. సాధారణంగా ఒక పనిని చేపట్టిన తర్వాత.. అది విజయవంతం అవుతుందో లేదో అనే సందేహాలు వుంటాయి. అయితే.. ఇది ఆ పనిని చేపట్టిన వారిపై ఆధారపడి ఉంటుంది.

అలానే.. ఇప్పుడు చేపట్టిన ఆవిష్కరణలు, యువతకు ఉపాధికల్పన, కొత్త పారిశ్రామికవేత్తలను తయారు చేయడం వంటి పనిని నేరుగా రతన్ టాటా సంస్థలు చేపట్టడంతో సర్కారు ఆదిలోనే అంచనాలు పెంచు కుంది. సదరు సంస్థపై ఉన్న నమ్మకం, ఆ సంస్థకు ప్రజల్లో ఉన్న క్రెడిబిలిటీ వంటివి కలిసి వస్తున్నా యి. తద్వారా సీఎం చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యాలను ఖచ్చితంగా సాధించడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం అమరావతి సహా ఐదు ప్రధాన నగరాల్లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్బులను ప్రారంభించారు.

వీటి ద్వారా స్థానిక యువతకు చక్కని అవకాశాలు కల్పించాలన్నది లక్ష్యం. ముఖ్యంగా ఇంటికో పారిశ్రామి క వేత్తను వెలుగులోకి తెచ్చేలా.. స్థానిక ఉత్పత్తులకు డిమాండ్ పెరిగేలా.. చేయాలని ప్రభుత్వ తలపోస్తోంది. నేరుగా ప్రభుత్వం పూనుకొని ఈ కార్యక్రమాన్ని చేసే పరిస్థితి లేదు. ఈ క్రమంలోనే నమ్మకానికి అమ్మ వంటి రతన్ టాటా సంస్థలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుని ఈ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇక, వీటి ద్వారా.. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క తరహా అభివృద్ది కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. తద్వారా వచ్చే ఐదేళ్లలో లక్ష మందికి ఉద్యోగాలు కూడా కల్పించనున్నారు.

మొత్తంగా ఈ ఇన్నోవేషన్ కేంద్రాల ఏర్పాటు అనేది దేశంలోనే తొలిసారి కావడం.. కీలక సంస్థ ఈ బాధ్యత తీసుకున్న నేపథ్యంలో చంద్రబాబు ఖుషీ అవుతున్నారు. ఏపీ దశ తిరిగినట్టేనని ఆయన అంచనా వేస్తున్నారు. అయితే.. వీటి ఫలాలు అందుకునేందుకు మరో రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటికి.. రాష్ట్రంలోని అన్ని నగరాల్లోనూ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్బులను తీసుకురానున్నారు. తద్వారా.. మెరుగైన ఉపాధి, పారిశ్రామికీకరణ కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. మరి చంద్రబాబుకలలు సాకారం కావాలని కోరుకుందాం.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.