ఉత్తర కోస్తా తమిళనాడు నుండి లక్షద్వీప్ & పక్కనే ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం ప్రాంతములోనున్న ఉపరితల ఆవర్తనం వరకు వున్న ఉపరితల ద్రోణి, కేరళ మీదుగా సగటు సముద్ర మట్టానికి 1. 5 కి.మీ.
ఎత్తులో విస్తరించి నేడు బలహీనపడింది. ఆంధ్ర ప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణం లోతూర్పు మరియు ఆగ్నేయ దిశ గా గాలులు వీస్తాయి. ఈ క్రమంలో రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు తెలుసుకుందాం…
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-
బుధవారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
గురువారం, శుక్రవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది .
దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ :-
బుధవారం, గురువారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది .
శుక్రవారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
రాయలసీమ :-
బుధవారం, గురువారం, శుక్రవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.